చంద్రబాబు.. ఆ కంపెనీకి పొమ్మనలేక పొగపెడుతున్నారా?

frame చంద్రబాబు.. ఆ కంపెనీకి పొమ్మనలేక పొగపెడుతున్నారా?

పాడి రైతులపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం కక్ష  కట్టింది. నాలుగేళ్లుగా గిట్టుబాటు ధర పొందుతున్న రైతుల పొట్టకొడుతోంది. పాలు సేకరించే క్షేత్ర స్థాయి సిబ్బందిని ఉపసంహరించుకోవడంతో పాటు అమూల్ కి సహాయ నిరాకరణ చేస్తూ ప్రైవేట్ డెయిరీల దోపిడీకి తెర తీస్తోంది. ముఖ్యంగా సొంత డెయిరీకి మేలు చేయడమే లక్ష్యంగా రాయలసీమ అమూల్ కు మోకాలడ్డుతోంది.

ఈ క్రమంలో పాల సేకరణ కూడా నిలిపివేస్తున్నట్లు అమూల్ ప్రకటించింది. తిరుపతిలో ఈ నెల 21నుంచి, అనంతపురం జిల్లాలో 11వ తేదీ నుంచి పాల సేకరణ నిలిపివేస్తున్నట్లు తెలిపింది. మిగిలిన రాయలసీమ జిల్లాల్లోను సెప్టెంబరు 1 నుంచి పాల సేకరణ నిలిపివేసేందుకు చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో పాడి రైతుల్లో అధిక శాతం మహిళలే. వారే ఇప్పుడు అమూల్ పాల సేకరణ కేంద్రాలు కొనసాగించాలంటూ ఆందోళన బాట పట్టారు. తిరుపతి, అనంతపురం జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద వందలాది మహిళలు, రైతులు నిరసన వ్యక్తం చేశారు.

చంద్రబాబు కూటమి అధికారాలు చేపట్టింది మొదలు అమూల్ విషయంలో పొమ్మనకుండా పొగ పెట్టాలా వ్యవహరిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అమూల్ ప్రాజెక్టు విస్తరణ కోసం జిల్లాకో డెయిరీ డెవలప్ మెంట్ అధికారిని నియమించారు. గ్రామ సచివాలయాల్లో డిజిటల్, వెల్ఫేర్, యానిమల్ అసిస్టెంట్స్ పర్యవేక్షణలో పాలసేకరణ జరిగే 15-20  గ్రామాలకో మెంటర్, ప్రతి 3-4 సచివాలయ పరిధిలో ఒక రూట్ ఇన్ ఛార్జిని నియమించారు.

అంతే కాకుండా మండల స్థాయిలో ఎంపీడీవో, జిల్లా స్థాయిలో పశు సంవర్థక శాఖ జేడీ, డీఆర్డీఏ పీడీ, జిల్లా సహకార శాఖాధికారులు పర్యవేక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 4వ రోజునే వీరిందరినీ వెనక్కి పంపించేసింది. అంగన్ వాడీ కేంద్రాలకు పాల సరఫరా బాధ్యతల నుంచి అమూల్ ని తప్పించింది. 4798 గ్రామాల్లో జరపాల్సిన పాల సేకరణ ఇప్పుడు 2 వేల గ్రామాలకు పరిమితం అయింది. పాలు పోసే వారి సంఖ్య 1.20 లక్షల నుంచి 30 వేల మందికి పడిపోయింది. ఒకవేళ అమూల్ పాల సేకరణ నిలిపివేస్తే ప్రైవేట్ డెయిరీలదే రాజ్యం అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: