ఇలా జరిగితే ఏపీలో కూటమి ప్రభుత్వం కూలిపోనుందా?

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చి ప్రభుత్వం కొలువు దీరింది. పాలన ప్రారంభం అయింది. అయితే విపక్షం నుంచి మాత్రం ఒక అనుమానం పెరుగుతూ వస్తోంది. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనేది వైసీపీ నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ.


ఇదే సమయంలో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్, ఓట్ ఫర్ డెమొక్రసీ లు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో బలమైన చర్చ నడుస్తోంది. మరోవైపు వీవీ ప్యాట్ల వెరిఫికేషన్ చేయాలని వైసీపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. అయితే సుప్రీం కోర్టు సైతం ఈ విషయంలో ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. కానీ ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అనుమానాలు పెరుగుతున్నాయి. ఎన్నికల సంఘం వెల్లడించిన పోలింగ్‌ శాతానికి, తరవాత ప్రకటించిన దానికి భారీ వ్యత్యాసం ఉండటం గమనార్హం.


ఏపీలో ఏకంగా 12.54 శాతం పోలింగ్ పెరగడంతపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే చాలా మంది వైసీపీ నేతలు నేరుగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఒకవేళ ఫారం 20 నమోదు చేస్తే మాత్రం అవకతవకలు వెలుగు చూసే అవకాశం ఉంది. అదే జరిగితే అత్యున్నత న్యాయస్థానం సీరియస్గా ఆలోచన చేసే పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా కూడా మారుతుంది.


ఒంగోలు నుంచి పోటీ చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, విజయనగరం ఎంపీ స్థానానికి పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్, బొబ్బిలి నుంచి పోటీ చేసిన సంభంగాఇ వెంకట చిన్న అప్పలనాయుడు.. తదితరులు ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే ఎన్నికల అధికారులు వీవీ ప్యాట్లను లెక్కించకుండా మాక్ పోలింగ్ నిర్వహించి వదిలేయడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాలినేని సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. ఏపీలో ఎన్నికల ప్రక్రియపై దేశ వ్యాప్తంగా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ అభ్యర్థులు ఒకటి అడిగితే వారు వారు ఇంకోలా సమాధానం ఇస్తున్నారు. కొంత మంది అధికారులు వైసీపీ నాయకులను ఫిర్యాదులు వెనక్కి తీసుకోమని కోరడం గమనార్హం. ఏదైనా అవకతవకలు జరిగితే కూటమి ప్రభుత్వం ప్రమాదంలో పడినట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: