కౌశిక్ రెడ్డి వెనుక ఉన్న తెలంగాణ మంత్రి ఎవరు?

తెలంగాణలో పబ్లిక్ అకౌంట్స్ ఛైర్మన్ పదవి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇవ్వడంతో వివాదం మొదలైంది. ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పదవిని అధికార పార్టీలో చేరిన వారికి ఎలా ఇస్తారు? అన్నది బీఆర్ఎస్ వాదన.


ఒకవైపు పార్టీలో చేరలేదని అరెపూడి గాంధీ చేసిన ప్రకటన నేపథ్యంలో మరి పార్టీ మారకుండా రేపు మీ ఇంటికి వస్తారు. పార్టీ కండువా కప్పుతాను. ఇద్దరం కలిసి మీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగిరేద్దాం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది.


పాడి కౌశిక్ రెడ్డి  వ్యాఖ్యల నేపథ్యంలో అరెపూడి ఇంటికి వెళ్లకుండా పోలీసులు అరెస్టు చేశారు. అరికెపూడి తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడం, కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ ఇంటి మీద దాడి చేయడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కౌశిక్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగలు కమలాకర్, ప్రశాంత్ రెడ్డి తదితరులు వెళ్లారు.


అక్కడి నుంచి సీపీ కార్యాలయానికి చేరుకొని దాడి చేసిన వారి మీద కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వారిని అరెస్టు చేసి మహబూబ్ నగర్ జిల్లాకు తీసుకెళ్లడం, వేలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు కేశంపేట పోలీస్‌  స్టేషన్ ముట్టడించడంతో అర్ధరాత్రి వారిని వదిలేయడం జరిగింది.


అయితే ఈ మొత్తం ఈ ఎపిసోడ్ లో ఎక్కడా స్పందించని బీజేపీ పార్టీ ఎక్స్ వేదికగా చేసిన ఒక ట్వీట్ తో మంత్రి, కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిని వివాదంలోకి లాగింది. కౌశిక్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కు బంధువు అయిన నేపథ్యంలో ఆయన వెనుక ఈయన ఉన్నారన్నది బీజేపీ వాదన. తెలంగాణలో ఎనిమిది ఎంపీలు, ఎనిమిది ఎమ్మెల్యేలను గెలుచుకున్న తర్వాత చల్లబడిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో విభేధాలు సృష్టించే ప్రయత్నంలో భాగంగానే ఈ ట్వీట్ చేశారనే వాదన ఉంది. దీనిపై కాంగ్రెస్, ఉత్తమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: