ఆప్ లో సంక్షోభం? సీఎం పదవి కోసం పార్టీలో కొట్లాట..!

ప్రకటించిన విధంగా చూస్తే దిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామాకు సమయం దగ్గర పడుతుంది. ఎప్పుడు ఏ క్షణంలో అయిన ఆయన పదవి నుంచి వైదొలుగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన చెప్పినట్లే చేస్తారా? అనేది కూడా అనుమానంగానే ఉంది. ఒకవేళ వెనక్కితగ్గితే అది కేజ్రీవాల్ కి దెబ్బే. ఆయనపై విశ్వసనీయత దెబ్బతింటుంది.


లేదా నిజంగానే రాజీనామా చేస్తే కేజ్రీవాల్ సవాల్ పై నిలిచిన వారు అవుతారు. ఆయన వ్యవహార శైలి చూస్తుంటే కచ్చితంగా రాజీనామా చేసే వారి లాగానే కనిపిస్తున్నారు.  రాజీనామా చేసి బీజేపీని ఇరుకున పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. కానీ పార్టీలో సీఎం పదవికి పోటీ పెరుగుతోంది. పదవిపై ఆశావహులు సంఖ్య కూడా భారీగానే ఉంది. నిన్నటి వరకు సీఎం భార్య సునీత పేరు.. మంత్రి ఆతీషీ పేర్లు ప్రముఖంగా వినిపించాయి.  


ఇప్పుడు మరో ముగ్గురి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఎవరు సీఎం కుర్చీలోకి వచ్చినా వారు పదవిలో ఉండేది ఫిబ్రవరి వరకే. ఎందుకంటే అప్పటి వరకు దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలి. కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నట్లుగా మహారాష్ట్రతో పాటే ఎన్నికలు జరిపితే అది నవంబరుతోనే దిల్లీ సీఎం పదవి కాలం ముగిస్తుంది.


కేజ్రీవాల్ రాజీనామా చేస్తే దిల్లీ సీఎంగా ముగ్గురు మంత్రులు బాధ్యతలు చేపట్టే ఛాన్సుంది. వారిలో నిన్నటి వరకు అతీషీ పేరు బాగా వినిపించింది. ఆమె కేజ్రీవాల్ అరెస్టు అయినప్పటి నుంచి మరింత పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె 15శాఖలను చూస్తున్నారంటే ఆమె ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మంత్రి గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లోత్, రాఘవ్ చద్దా తదితరులు కూడా సీఎం పదవి కావాలని పట్టుబడుతున్నారు అంట. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించి పార్టీ పెట్టి సీఎం అయిన కేజ్రీవాల్ ఇప్పుడు ఆయన భార్యని సీఎం చేసి ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: