పోలింగ్ కు ముందే చేతులు ఎత్తేసిన మోదీ?

జమ్మూ కశ్మీర్ లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబరు 18, సెప్టెంబరు 25, అక్టోబరు 1న అక్కడ పోలింగ్ జరగనుంది. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్ లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. ఇటీవల ముగిసిన లోక్ సభ ఎన్నికల్లో అధిక ఓటింగ్ శాతం నమోదైంది.



ఆర్టికల్ 370 ని 2019లో రద్దు చేసిన తర్వాత జమ్మూ మరియు కశ్మీర్  రాజకీయ దృశ్యం ఒక్కసారిగా మారిపోయింది. ఈ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తు పాలనను నిర్వచించనున్నాయి. కశ్మీర్ జనాభాలో 96 శాతానికి పైగా ముస్లింలు ఉన్నారరు. బీజేపీ 2014లో 60శాతం కంటే ఎక్కువ ఓట్లతో 25 సీట్లను గెలుచుకుంది.  అయితే ఇప్పుడు పోలింగ్ కు ముందే బీజేపీ చేతులు ఎత్తేయడం హాట్ టాపిక్ గా మారింది. జమ్మూ కశ్మీర్ లో మొత్తం 47 స్థానాలు ఉండగా.. బీజేపీ కేవలం 19 చోట్ల మాత్రమే తమ పార్టీ అభ్యర్థులను బరిలో ఉంచింది.


మిగిలిన 28 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపలేదు. దీంతో బీజేపీకి ఆయా చోట్ల ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో సైతం కశ్మీర్ లో బీజేపీ తమ అభ్యర్థులను పోటీలో ఉంచలేదు. జమ్మూలో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టి రెండు ఎంపీ స్థానాలను గెలుచుకుంది.


ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు బాగా తగ్గాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరి అలాంటి అప్పుడు బీజేపీ ఎందుకు పూర్తి స్థాయిలో పోటీ చేయడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. బీజేపీకి ఇక్కడ గెలుపుపై నమ్మకం లేదా అని పలువురు విశ్లేషకులు తమ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ  నేతలు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా.. స్థానిక పరిస్థితులు మాత్రం వారికి అనుకూలంగా లేవని అర్థం అవుతుంది. మరి జమ్మూ కశ్మీర్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: