ఏపీలో కూటమి మధ్య చిచ్చు?

frame ఏపీలో కూటమి మధ్య చిచ్చు?

ఏపీలో అయిదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఆ పార్టీతో జత కట్టి పవర్ లోకి వచ్చిన జనసేనలకు ఇప్పుడు బీజేపీ మధ్యంతర షాక్ ఇచ్చింది. ఏపీలో అయిదేళ్ల పాటు నిండుగా అధికారంలో ఉంటామని టీడీపీ కూటమి ప్రభుత్వం నెమ్మదిగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తుంది.


టీడీపీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కూడా వాయిదా వేసుకుంటుంది. ఇంకా అయిదేళ్లు టైం ఉంది కదా అని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే కేంద్రంలో బీజేపీ పెద్దలు మాత్రం వడివడిగా మధ్యంతరం వైపు అడుగులు వేస్తున్నారు. కేంద్రంలోను బీజేపీ లోను బలమైన నాయకుడిగా ఉన్న హొం మంత్రి అమిత్‌ షా మధ్యంతతర ఎన్నికలపై సంచలన ప్రకటన చేశారు. అది కూడా కచ్ఛితంగా జరిగి తీరుతుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.


ఇప్పడు బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే జమిలి ఎన్నికల్లో మధ్యంతరం తీసుకొని రావాలని బీజేపీ చూస్తోందని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి బీజేపీకి జమిలి ఎన్నికల ఆలోచన విధానం ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో ఆ పార్టీ జమిలి ఎన్నికల విధానానికి మొగ్గు చూపుతుంది. అలాగే 2019లోను జమిలి ఎన్నికల టాపిక్ తెరపైకి వచ్చింది. ఆ తర్వాత 2024లోను మరోసారి అదే మాట అన్నారు.


కానీ అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు మాత్రం కచ్ఛితంగా జరిపేలా ఉన్నారు. బీజేపీకి మూడో సారి అధికారం దక్కింది. ఆ పార్టీ అజెండాలో ఉన్న ఒక్కో అంశం నెమ్మదిగా అమలు చేసకుంటూ వస్తున్న బీజేపీ ఒకే దేశం ఒకో ఎన్నిక అన్న దాన్ని కూడా కన్ఫర్మ్ గా చేసి తీరుతుంది అని అంటున్నారు. దానికి కారణాలు అనేకం చెబుతున్నారు.


లోక్ సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు ఒకే సారి జరిగితే మోదీ ప్రభావం ఆయా రాష్ట్రాల మీద పడుతుంది. లేకపోతే ప్రజలు ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటితో పాటు పలు కారణాలను సాకుగా చెబుతోంది. మరి ఏపీ సంగతేంటి అన్నది ఇక్కడ మ్యాటర్ గా ఉంది. ఏపీలో రెండేళ్లలో ఎన్నికలు జరిగితే అప్పటికి కూటమి ప్రభుత్వం సర్దుకుంటుందా అన్నది కూడా చూడాలి. హామీలు అమలు చేస్తే.. ఓకే కానీ.. అటు సంక్షేమ ఇటు అభివృద్ది లేకపోతే మాత్రం ఏపీలో కూటమికి ఇబ్బందులు తప్పవు అనే చర్చ సాగుతోంది. మరి టీడీపీ జమిలి ఎన్నికలు ఏం అంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: