వీర విధేయులు వెళ్లి పోతున్నా లైట్ తీసుకుంటున్న జగన్..! ఏంటి ధైర్యం..!

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ జనసేనలో చేరనున్నారు. అయితే ఆయన ఒక్కరే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నేతలతో కలిసి జనసేనలోనిక చేరతారనే ప్రచారం నడుస్తోంది. అయితే వీరంతా జగన్ సన్నిహితులే కావడం విశేషం. బాలినేని శ్రీనివాస రెడ్డి జగన్ కు స్వయంగా బంధువు.  అయినా సరే జగన్ తీరు నచ్చక పార్టీని వీడుతున్నారు.


మరో సన్నిహిత నేత సామినేని ఉదయభాను సైతం బాలినేని తో కలిసి జనసేనలో చేరతారు అని టాక్ నడుస్తోంది. మాజీ మంత్రి ఆళ్ల నాని సైతం వీరిని అనుసరిస్తున్నట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా వీరంతా జనసేన నాయకత్వంతో టచ్ లోకి ఉన్నట్లు సమచారం. ఈ ముగ్గురు నేతలు పవన్ కల్యాణ్ పై విమర్శలు చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఈ ముగ్గురు నేతలు పవన్ కల్యాణ్ పై విమర్శలు చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఎన్నికలకు ముందు నుంచే ఒక రకమైన అనుకూలతతో ఉన్నట్లు తెలుస్తోంది.


వైసీపీ ఓడిపోవడతో వీరంతా పార్టీ నుంచి బయట పడాలని భావించారు. ఇప్పటికే ఆళ్ల నాని రాజీనామా చేశారు. నిన్ననే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఏకంగా జగన్ తీరు నచ్చక బయటకు వెళ్లిపోతున్నారు. అటు సామినేని ఉదయభాను కూడా జగన్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు.


వైసీపీలో ఒక రకమైన అనిశ్చితి కనిపిస్తోంది. జగన్ తో పాటు వైఎస్సార్ కుటుంబానికి సన్నిహిత నేతలు పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. దీంతో జగన్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. పార్టీని తిరిగి యాక్టివ్ చేసే క్రమంలో నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలకు అధ్యక్షులుగా సీనియర్లను నియమించారు.  బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడటంతో ప్రకాశం జిల్లా నేతలతో సమీక్ష జరపనున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బూచేపల్లిని ఖరారు చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా పార్టీని ఎందరు వీడుతున్నా జగన్ మాత్రం ఉన్నవారితోనే పార్టీని పటిష్ఠం చేసే పనిలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: