అదీ జగన్ అంటే..! పార్టీ పునః నిర్మాణానికే సంచలన నిర్ణయం ?

జగన్ పార్టీని పున: నిర్మించబోతున్నారా.. త్వరలోనే వైసీపీని సమూలంగా ప్రక్షాళన చేయబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వైసీపీలో ఇప్పుడు చాలా మంది అసంతృప్తి లో ఉన్నట్లు జగన్ కు తెలిసి వచ్చింది. దీంతో వారందరిని మళ్లీ ఏకతాటిపై తీసుకు రావాలని ఇప్పుడున్న పార్టీ లీడర్లను, వారి పదవులను చేంజ్ చేయాలని భావిస్తున్నారంట జగన్.


ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మంది పార్టీ వీడి వెళ్లిపోతున్నారు. దీంతో జగన్ పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలంటే పెద్ద నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారంట. మరి ముఖ్యంగా గ్రామ స్థాయిలో, అట్టడుగు స్థాయిలో ఉండే కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నారంట. మొన్న ఎన్నికల సమయంలో వీరంతా పార్టీకి దూరంగా ఉన్నారు. కానీ వ్యక్తిగతగా వారిలో జగన్ మీద అభిమానం ఉంది.  కాబట్టి వారిని యాక్టివ్ చేస్తే ఆటోమేటిక్ పార్టీ గాడిలో పడుతుందని భావిస్తున్నారు.


అయితే వీరి మీద రీజనల్ గా ఉండే లీడర్లు పెత్తనాలు బాగా చేస్తున్నారంట.  నియోజకవర్గ స్థాయి లీడర్ల పెత్తనాలు బాగా చేస్తున్నారంట. నియోజకవర్గ స్థాయి లీడర్ల పెత్తనాలు భరించలేక కార్యకర్తలు పార్టీని వీడుతున్నట్లు జగన్ కు తెలిసింది. అందుకే నియోజకవర్గ స్థాయి లీడర్ల నుంచి హైకమాండ్ గా చెప్పుకునే లీడర్ల దాకా చాలా మందిని మార్చేయబోతున్నారంట జగన్.


విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు కొందరినీ పార్టీని వారి పరిధిని తగ్గించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల పార్టీలో అందరికీ అవకాశాలు వస్తాయని.. స్వేచ్ఛ పెరుగుతుందని భావిస్తున్నారంట జగన్. ఇక నుంచి తానే నేరుగా కింది స్థాయి లీడర్లతో మమేకం కావాలని కూడా ఆలోచిస్తున్నారంట. అప్పుడు తనకు పార్టీ కార్యకర్తలకు గ్యాప్ ఉండదని.. కార్యకర్తలకు తాను అందుబాటులో ఉంటాననే భరోసా ఇచ్చినట్లు అవుతుందని అనుకుంటున్నారంట జగన్. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఆయన నిర్ణయాలు ఏ మేర ఫలిస్తాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: