ఆ విషయంలో మోదీకి షాక్ ఇవ్వనున్న చంద్రబాబు?
రాజకీయంగా దిగ్గజ నేత. దేశ రాజకీయాల్లో కీలకమైన వారు, సీనియర్ మోస్ట్ లీడర్ చంద్రబాబు ఈ రోజున జాతీయ స్థాయిలో అతి ముఖ్యమైన అంశంగా ఉంటూ పెద్ద చర్చకు లేవదీస్తున్న జమిలి ఎన్నికల విషయంలో స్పందించింది అయితే లేదు అని అంటున్నారు. చంద్రబాబు ఏపీకి సీఎం. ఏపీలో ఎన్డీయే సర్కారు సారథి. అంతే కాదు కేంద్రంలో మోదీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కారుకు బలమైన సారథి.
ఈ రోజున కేంద్రంలో ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధానిగా ఉన్నారు అంటే దానికి కారణం చంద్రబాబు అనే చెప్పాలి. అలా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని తన భుజాల కాసి నిలబెడుతున్న చంద్రబాబు ఎన్డీయే సర్కారు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎంత వరకు భాగస్వామిగా ఉన్నారు అన్నది ఒక ప్రశ్న. అదే సమయంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం దేశంలో ఒకే ఎన్నికలు అంటూ జమిలికి తెర తీసిన తెర తీసిన వైనం మీద ఆయన స్పందన ఏమిటి అన్నది ఏపీనే కాదు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
ఎందుకంటే చంద్రబాబు నిర్ణయం ఇప్పుడు చాలా ప్రధానం. ఆయన జమిలికి ఎస్ అంటేనే బండి ముందుకు కదులుతుంది. ఆయన నో అంటే మాత్రం కేంద్రం ఈ విషయంలో కొంత ఆలోచనలో పడాల్సి ఉంటుంది. పార్లమెంట్ లో దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశ పెడితే టీడీపీ ఎంపీల మద్దతు అత్యంత కీలకంగా మారతుంది. వారు కనుక ఓటింగ్ లో లేకపోతే బిల్లు వీగిపోతుంది.
అయితే అయిదేళ్ల పదవిని వదులుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపరు. మరి అక్కడ ఉన్నది చంద్రబాబు. అపర చాణక్యుడు. ఈ లెక్కన షెడ్యూల్ ప్రకారం 2029 లో ఎన్నికలకే వెళ్లేందుకు మొగ్గు చూపుతారు. అంతే కానీ జమిలికి జై కొట్టి మధ్యంతరానికి ఆసక్తి చూపరని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు మధ్యంతరం అంటే కూటమికి ఆత్మ హత్యా సదృశ్యం అని కూడా కొంతమంది అంటున్నారు. అందువల్ల ఏ విధంగా చూసినా జమిలికి ఆయన జై కొట్టే పరిస్థితులు లేవని అంటున్నారు. మరి ఆయన ఏం చెబుతారో చూడాలి.