జమిలి అంత ఈజీ కాదా..! మోదీకి ఎదురు దెబ్బ తప్పదా?

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. అందుకు అనుగుణంగా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర చేసింది. దీంతో.. దీన్ని బిల్లు రూపంలో వచ్చే శీతాకాలం సమావేశాల్లో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.



అయితే చెప్పినంత.. అనుకున్నంత ఈజీగా జమిలి ఎన్నికల ముచ్చట చట్టంగా మారే అవకాశం లేదు. దీనికి భారీగానే కసరత్తు చేయాల్సి ఉంటుంది. పెద్ద ఎత్తున విపక్షాలను కూడగట్టుకోవడంతో పాటు.. బిల్లు ఆమోదానికి అత్యధికుల ఆమోదం పొందాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలు వస్తే.. అన్ని రాష్ట్రాలకు లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అయితే మధ్యలో ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం సంక్షోభంలో పడి ప్రభుత్వం కూలిపోతే.. లోక్ సభ ఎన్నికలు జరిగే వరకు అయితే గవర్నర్ పాలన.. లేదంటే రాష్ట్రపతి పాలన నడవాల్సి ఉంటుంది.  ఎప్పుడైతే ఆ సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తారో అప్పటి వరకు ఆ రాష్ట్రానికి ఎన్నికలు నిర్వహిస్తారు.


జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి చట్టంగా చేయాలంటే పలు సవరణలు చేయాలి. ఒక లెక్క ప్రకారం చూస్తే దాదాపు ఆరు సవరణలు అవసరం అవుతాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ, కీలక రాజ్యాంగ సవరణకు పార్లమెంట్ ఆమోద ముద్ర, రాజ్యాంగానికి ఆరు సవరణలు చేయాల్సి ఉంటుంది.


పై సవరణలు అమలు కావాలంటే 2/3 మెజార్టీతో సభ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం లోక్ సభలో బీజేపీ సభ్యుల బలం లేదు. అదనంగా ఎంపీల మద్దతు అవసరం. రాజ్యసభలో అయితే మరింత కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే లోక్ సభలో ప్రస్తుతం ఎన్డీయేకి ఉన్న బలం 293 మంది. కానీ బిల్లు ఆమోదం పొందాలంటే 362 మంది సభ్యుల అవసరం. ఇక రాజ్యసభలో ఎన్డీయే బలం 121 మంది మాత్రమే. జమిలి ఆమోదం పొందాలంటే 164 మంది సభ్యులు అవసరం. వీటితో పాటు దేశంలోని సగం రాష్ట్రాలకి పైగా  దీనికి ఓకే చెప్పాలి. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇది ఒక్కటే మోదీకి సానుకూలాంశం. కష్టమంతా రాజ్యసభలోనే ఎదరువుతుందని విశ్లేషకులు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: