రాజకీయాలకు కవిత గుడ్ బై చెప్పనున్నారా?

తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎంత ఫేమస్సో.. ఆ పండుగ హడావుడి.. సంస్కృతి సంప్రదాయాలు కూడా అంతే ఫేమస్. పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో బతుకమ్మ వచ్చిదంటే చాలు.. కేసీఆర్ వారసురాలు, కవిత హడావుడి చేసేవారు. వారం పాటు నిత్యం ఒక్కో చోట బతుకమ్మ ఆడి స్వయంగా పేరుస్తూ వేడుకలు నిర్వహించేవారు.


తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కవిత.. హాట్ టాపిక్ అయ్యారు. ఆమె రాజకీయాలకు గుడ్ బై చెప్పారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. జైలు నుంచి వచ్చిన తర్వాత ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసినట్లుగా … తాను కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది.


ప్రస్తుత రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇస్తే పరిస్థితి బాగా లేదని కవితకు ఒక రిపోర్టు వచ్చిందంట. ప్రజా ప్రతినిధిగా ఎక్కడ పోటీ చేసినా ఆమె గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారంట. అందుకే ఆమె శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారట. అంతేకాదు తన భర్తతో కలిసి వ్యాపారాలు చూసుకోవాలని కల్వకుంట్ల కవిత డిసైడ్ అయినట్లు సమాచారం.


ఏదైనా పండుగలు వస్తే తప్ప కేసీఆర్ ఇంటికి కూడా వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెగ వైరల్ అవుతుంది. మొత్తానికి ఆమె రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. దీనిపై ఆమె ఏదో ఒక ప్రకటన ఇస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. బతుకమ్మ సంబురాలు మరో పది రోజుల్లో ప్రారభం కానున్నాయి. ఈ వేడుకల్లో ఆమె గ్రాండ్ గా ప్రజా క్షేత్రంలో ఇవ్వనున్నారు అనే ప్రచారం లేకపోలేదు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పడాలంటే మరో పది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: