నాటి ఫైర్ ఏది జగన్? ఇలా అయితే ఎలా

జగన్ అంటే గన్ అని చెప్పుకునేవారు. ఆయన ఫైర్ గురించి వేరేగా చెప్పాల్సిన పని లేదు. ఆయన యువ నేతగా రాజకీయాల్లోకి వచ్చి కొత్త శకాన్ని ఆవిష్కరించారు. ఉమ్మడి ఏపీలో అప్పటి వరకు ఉన్న రెండు బలమైన పార్టీలు కాంగ్రెస్, టీడీపీను ఎదుర్కొని ధీటుగా వైసీపీని తీర్చిదిద్దారు. జగన్ సవాళ్లను చాలా గట్స్ గా ఎదుర్కొనేవారు. ఆయన జనంలోకి వస్తే అది ప్రభంజనమే అయ్యేది. జగన్ అంటే జనం అన్నట్లుగా ఉండేది.


రాజకీయ నాయకులతో వర్తమాన తరంలో జగన్ కి ఉన్న క్రేజ్ అలాంటిది అన్న చర్చ కూడా సాగింది. జగన్ కి ఎన్నికల్లో గెలుపోటములు కొత్త కాదు. ఆ మాటకు వస్తే ఆయనకు ఆయనే సాటి. గెలుపోటములకు అతీతంగా ఉండేవారు. తన లీడర్ షిప్ క్వాలిటీస్ తో ఎటువంటి పెను విపత్తులను అయినా చాలా సులభంగా ఎదుర్కొనేవారు. జగన్ గట్స్ ని చూసి ఆకర్షితులు అయ్యేవారు ఉన్నారు.


ఆయన ఉంటే చాలు పార్టీకి ఏమి కావాలి అని గుండె మీద చేయి వేసుకొని ధీమాగా ఉండేవారు. అలాంటి జగన్ 2018లో అధికారంలో వచ్చాక పరదాల మాటుకు వెళ్లిపోయారు అన్నది కూడా అంతా అనుకునే మాట. అయిదేళ్లకు పైగా అధికారంలో  ఉండి ఇప్పటికి జగన్‌ బయటకు రావడం లేదు.


ఆయన లేటేస్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాలు చేయండి.. మా మీద మమ్మల్ని అలా ఎదుర్కోండి ఇలా దేవుడిని అడ్డం పెట్టుకొని కాదు అని చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు. అంతే కాదు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని విమర్శిస్తున్నారు. కానీ ప్రత్యర్థి పార్టీ నాయకులు లడ్డూ విషయాన్ని చాలా స్ట్రాటజిక్ గా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆయన నింపాదిగా కూర్చుంటే పార్టీకి జరగాల్సిన నష్టం జరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఆయన యాక్షన్ ప్లాన్ రూపొందించి అగ్రెసివ్ మోడ్ లోకి వెళ్లాలని సూచిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ని ఏ మాత్రం లైట్ తీసుకోవడం లేదు. కానీ జగన్ చంద్రబాబు ని లైట్ తీసుకుంటే మాత్రం పార్టీ ఉనికికే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: