తిరుమల వివాదం.. విచారణ వద్దు అంటున్న వైవీ సుబ్బారెడ్డి? భయపడుతున్నారా?

ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఛైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కాగా టీటీడీ ఛైర్మెన్ గా ఉన్నప్పుడు భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందని.. అలాగే అన్య మతస్థులకు ఉద్యోగాలు ఇచ్చారని.. లడ్డూ తయారీలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని.. నాసిరకం నెయ్యి కొనుగోలు చేశారని వైవీ సుబ్బారెడ్డి పై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.


ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆయనపై విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ విచారణకు ఆదేశించింది. ఆ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం తనపై వేసిన విచారణను నిలిపి వేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టుని అభ్యర్థించారు. టీటీడీ ఛైర్మెన్ గా ఉన్నప్పుడు తాను తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని విజిలెన్స్, ఎన్ఫోర్సెమెంట్ ఎస్పీ కోరారని కోర్టుకి నివేదించారు.


టీటీడీ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని.. దానిపై విచారణ చేసే అధికారం విజిలెన్స్ కు లేదని వైవీ తన పిటిషన్ లో పేర్కొన్నారు. నాపై ఉన్నం ఆరోపణలేంటి? అందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరితే విజిలెన్స్ ఎస్పీ స్పందించలేదు. నా వివరణ లేకుండానే విచారణ పూర్తి చేశారు. అని వైవీ సుబ్బారెడ్డి తన పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు. టీటీడీకి సొంత విజిలెన్స్ విభాగం ఉందని చెప్పారు.


ఈ నేపథ్యంలో తనపై ప్రభుత్వం వేసిన విజిలెన్స్, ఎన్‌ ఫోర్స్ మెంట్ విచారణను రద్దు చేయాలని కోర్టుని అభ్యర్థించారు. తన పిటిషన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, టీడీటీ ఈవో , విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టర్, ఎస్పీలను ప్రతి వాదులుగా చేర్చారు. వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ పై హైకోర్టు సెప్టెంబరు 23న విచారణ జరపనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: