చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసే పనిలో పవన్ కల్యాణ్?

గత రెండు రోజులుగా తిరుమలలో తయారు చేసే లడ్డూలపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన సంచలన ఆరోపణలు జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తిరుమల లడ్డూలను తయారు చేయడం కోసం ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఎన్డీబీ రిపోర్టులో కూడా జంతువుల కొవ్వు వినియోగించారని తేలడంతో మాజీ సీఎం జగన్ పై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.


బాధ్యులని కఠినంగా శిక్షించాలని ఆయా పార్టీల నాయకులతో పాటు హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సినీ సెలబ్రీటీలు, ప్రముఖులు, ప్రజా ప్రతినిథులు సైతం ఈ ఘటనపై విచారణ జరిపించి కఠిన శిక్షలు అమలు చేయాలని కోరుతున్నారు. కచ్చితంగా సీబీఐ విచారణ జరపాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు.


ఇక దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ స్పందించారు. భవిష్యత్తలో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే జాతీయ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక ట్విటర్ లో ఈయన చేసిన వ్యాఖ్యలకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇది ఇలా ఉండగా.. ఆయన 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష ని ప్రారంభించపోతున్నారు. ఈ సందర్భంగా  పవన్ మాట్లాడారు.


ఏడుకొండల వాడా.. క్షమించు అమృతంతో సమానంగా, పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం లో గత పాలకుల వికృత చేష్టల ఫలితంగా అపవిత్రమైందిజ జంతు అవశేషాలతో కూడిన నెయ్యిని ప్రసాదం కోసం వినియోగించి.. అపవిత్రం చేశారని తెలుసుకొని నా హృదయం ముక్కలైంది. అపరాధ భావనకు గురైంది. ప్రజా క్షేమాన్ని కోరుతూ..ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను. పదకొండు రోజుల పాటు దీక్ష చేపట్టి అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాను అని పేర్కొన్నారు.  ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: