మరో రోడ్డు మ్యాప్ సిద్ధం చేస్తున్న రేవంత్..! స్కెచ్ మామూలుగా లేదుగా?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థలకు రెఢీ అవుతున్నారు. నేతలను అందుకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలను దెబ్బతీసేలా కసరత్తులు చేస్తున్నారు. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే కాకుండా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నారు.


అందుకోసం అస్త్రశస్త్రాలను  సిద్ధం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా పథకాలను అందించి ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లే ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకోసం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శాసన సభ పక్ష సమావేశం కూడా నిర్వహించారు. సమావేశం మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు సాగడంపైనే సాగింది. తెలంగాణకు కొత్త పీసీసీ అధ్యక్షుడు రావడంతో అన్ని రకాలుగా ముందుకు వెళ్లి పార్టీని బలోపేతం చేయాల్సిన అంశాలపై చర్చించారు.


అందుకోసమే ప్రత్యేకంగా సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నేతలకు నియోజకవర్గాలుగా బాధ్యతలను అప్పగించి.. అక్కడి ప్రధాన సమస్యలపై రానున్న కాలంలో దృష్టి పెట్టి నోటిఫికేషన్ కు ముందే ప్రజల మనసులను గెలిచే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. 100 శాతం స్రైయిక్‌ రేట్ తో విజయం సాధించాలనే లక్ష్యాన్ని నేతలకు విధించినట్లు తెలిసింది.


దీంతో పాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను కూడా బలహీన పరిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మరిన్ని పథకాలను వీలైనంత త్వరగా అమలు చేయాలనే నిర్ణయానికి సీఎం రేవంత్ వచ్చారు.  దీనికోసం రోడ్ మ్యాప్ ను రెడీ చేస్తున్నారు. అమలు చేసిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు మిగిలిపోయిన రైతు భరోసా, మహా లక్ష్మి పథకంలో కొన్నింటిని అమలు చేయడంపై కసరత్తులు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకే మాట మీద ఉండాలని.. సమన్వయం లేకుండా ప్రకటనలు చేస్తే ప్రతిపక్ష పార్టీలకు ఊతమిచ్చినట్లు అవుతుందనే అభిప్రాయంతో రేవంత్ ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా రైతు రుణమాఫీ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ దిశా నిర్దేశం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: