రేవంత్ కి షాక్..! హైదరాబాద్ లో భూములు కొనాలంటే భయపడుతున్న రియల్టర్లు?

కొన్ని రోజులుగా హైడ్రా నగర వాసుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీనిని సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కాన్సెప్ట్ ని ప్రతిష్ఠాత్మకంగా  తీసుకొని అమలు చేస్తున్నారు. దీనికి ఐపీఎస్ అధికారిని కమిషనర్  గా నియమించి.. అదనపు అధికారాలు సైతం ఇచ్చారు. ప్రత్యేకంగా పోలీసులు, సిబ్బందిని కేటాయించారు. ఈ క్రమంలో హైడ్రా చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.


చెరువులు, నాలాలు, బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిలో ఇళ్లను నిర్మించిన వారికి మెయిన్ గా హైడ్రా చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే 160కి పైగా అక్రమ నిర్మాణాల్ని కూల్చివేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన తర్వాత హైడ్రా పేరు ఒక్కసారిగా దేశమంతటా విస్తరించింది.


ఈ హైడ్రా ఎఫెక్ట్ వల్ల ప్రభుత్వానికి ఎంత మేలు జరుగుతుందో అనే విషయాన్ని పక్కన పెడితే.. దీని వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రం కుదేలయింది. మెయిన్ గా గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లో భారీగా రిజిస్ట్రేషన్లు పడిపోయినట్లు ఇటీవల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ప్రముఖ రియల్ ఎస్టేట్ డాలా అనలిటికల్ సంస్థ ప్రాప్ ఈక్విటీ ఒక డాటాను విడుదల చేసింది. దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో ప్రస్తుతం జులై-సెప్టెంబరు త్రైమాసికం ఇళ్ల అమ్మకాలపై ఒక రిపోర్టును విడుదల చేసింది.


దీని ప్రకారం 42 శాతం క్షీణతతో హైదరాబాద్ నగరం ముందు వరుసలో ఉంది. ఆ తర్వాత బెంగళూరు 26 శాతం, కోల్ కతా 23 శాతం, పుణె 19శాతం, చెన్నై 18శాతం, ముంబయి 17శాతం, థానె 10శాతం లో ఉన్నాయి. హైదరబాద్ లో జులై-సెప్టెంబరు త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 12082 యూనిట్లుగా ఉండొచ్చని కూడా రియల్ ఎస్టేట్ ఈక్విటీ వెల్లడించింది. గత ఏడాది ఇదే వ్యవధిలో 20658 యూనిట్ల విక్రయాలు జరిగాయని వెల్లడించింది. తాజా సర్వేలో అన్ని నగరాల్లో కంటే హైదరాబాద్ లోనే అత్యంత క్షీణత కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: