సడెన్ గా గేర్ మార్చిన పవన్! షాక్ లో చంద్రబాబు?

ఏపీలో టీడీపీ కూటమిలో పవన్ కి ప్రాధాన్యం బాగానే ఉంది. అదే సమయంలో ఆయన కీలకమైన శాఖలనే చూస్తున్నారు. ఇదిలా ఉంటే కూటమిలో టీడీపీలో చేరికలు ఎక్కువగా సాగుతున్నాయి. వైసీపీ నుంచి వస్తున్న వలసలు అన్నీ సైకిలెక్కేస్తున్నాయి. జనసేనలోకి పెద్దగా రావడం లేదు అన్నం మాట ఉంది.


దీంతో ఇప్పుడు పవన్ గేర్ మార్చి స్పీడ్ పెంచారు అని అంటున్నారు. టీడీపీ కూటమిలో ముఖ్య భాగస్వామిగా ఉంటూనే కీలకమైన జిల్లాల్లో బలం పెంచుకునే వ్యూహాన్ని పవన్ కల్యాణ్ అమలు చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో ఇటీవల ఒక జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ మొదట జనసేనలోకి వెళ్తామని చెప్పి ఆ తర్వాత సైకిల్ ఎక్కేశారు. దీంతో పవన్ కూడా కొంత అలెర్ట్ అయ్యారు.


మిత్రులుగా ఎంత ఉన్నా సరే.. ఎవరి రాజకీయం వారిదే అని అంటున్నారు. వైసీపీ నుంచి వస్తున్న నాయకులను తాము మాత్రం ఎందుకు చేర్చుకోకూడదు అనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జనసేనాని గేర్ మార్చి గేట్లు ఎత్తేశారు అంటున్నారు. దీని ఫలితంగానే ప్రకాశం జిల్లాలో బిగ్ షాట్ గా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వచ్చారని చెబుతున్నారు.


పైగా ఆయన జగన్ దగ్గరి బంధువు, దీంతో వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్లు వైసీపీని వీక్ చేయడం మోరల్ గా కూడా దెబ్బతీయడం జరిగిందని అంటున్నారు. దాంతో పాటు కృష్ణాజిల్లాలో కూడా మరో కీలక నేతను జనసేన తన వైపు తిప్పుకుంది. సామినేని ఉదయభాను వైసీపీని వీడి జనసేన కండువా కప్పుకోనున్నారు. దీంతో ఆ జిల్లాలో జనసేన జోష్ పెరిగింది.


జనసేన ఎందుకు ఇలా ఒక్కసారి తన స్ర్టాటజీ ని మార్చుకుంది అంటే ముందస్తు వ్యూహమే అంటున్నారు విశ్లేషకులు. రేపటి రోజున ఎటు నుంచి ఎటు పోయినా తన బలాన్ని పెంచుకుంటే దానికి తగ్గట్లు రాజకీయ వాటా ఉంటుందని ఆలోచనతో ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ ఒక మాట చెబుతూ ఉండేవారు. మన బలం ఎంతో తెలిస్తే వచ్చే సరికి మరింత డిమాండ్ చేయగలుగుతామని.. ఇప్పుడు 21 సీట్లు గెలుచుకునే సామర్థ్యం ఉందని చెప్పారు. అందుకు వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పవన్ పార్టీని రెఢీ చేస్తున్నారు అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: