లడ్డూ ప్రసాదం.. అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన మోదీ? వారికి చుక్కలేనా..!

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ చాలా సీరియస్ అయింది. తిరుమల లడ్డూల తయారీ కోసం సరఫరా చేసే నెయ్యి లో నాణ్యతా ప్రమాణాలు పాటించని తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది.



తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యి సరఫరా చేసే నాలుగు కంపెనీలకు చెందిన నెయ్యి నమూనాలను కేంద్ర ప్రభుత్వం సేకరించింది. ఈ మేరకు ఆ నెయ్యి నాణ్యతపై పరీక్షలు నిర్వహించింది.


వాటిలో తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన మూడు కంపెనీలు సరైన ప్రమాణాలు పాటించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. అయితే తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీ మాత్రం నెయ్యి నాణ్యతా పరీక్షల్లో ఫెయిల్ అయిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు సరైన ప్రమాణాలు పాటించకుండా.. కల్తీ నెయ్యి తిరుమల శ్రీ వారి లడ్డూలు తయారు చేయడాన్ని సరఫరా చేస్తున్న ఆ కంపెనీకి స్టాండర్డ్స్ సేఫ్టీ అథారిటీ ఆప్‌ ఇండియా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై ఏఆర్ కంపెనీ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి.


అయితే ఏఆర్ కంపెనీ ఏం చెబుతుంది. ఎలా స్పందిస్తుంది అంటూ కోట్లాది మంది శ్రీవారి భక్తులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడిన వైసీపీ నాయకులు నెయ్యి సరఫరా చేయడానికి కాంట్రాక్టులు ఇచ్చారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అప్పటి టీటీడీ బోర్డుకు చెందిన కొందరు నెయ్యి కాంట్రాక్టులతో కుమ్మక్కు అయ్యారని అధికార పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం జోక్యం చేసుకోవడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: