మోదీ ప్రభంజనం.. వీసా తిరస్కరించిన చోటే.. నమో నామస్మరణ..!

ఒకప్పుడు మనల్ని కాదన్నవారే పిలిచి మరీ రెడ్ కార్పొరేట్ వేస్తే.. ఒకప్పుడు మన్నలి పక్కనపెట్టివారే పట్టాభిషేకం చేస్తే ఒకప్పుడు నిందలు వేసిన వారే.. ఇప్పుడు నువ్వే గొప్ప అని కొనియాడుతుంటే.. ? 20 ఏళ్ల క్రితం మోదీకే వీసా నిరాకరించిన అగ్ర రాజ్యం ఇప్పుడు ఆయనకు సాగిలపడుతోంది.


మరీ ముఖ్యంగా ఎన్నికల  ముంగిట మోదీని పిలిచి మరీ ఆకాశానికి ఎత్తేస్తుంది. గతంలో సరిగ్గా ఎన్నికల సమయంలో మోదీనే తమ దేశానికి ఆహ్వానించింది అమెరికా ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వరుస కార్యక్రమాలతో ఆయన బిజీబిజీగా గడిపారు. క్వాడ్ సదస్సు, ఎన్ఆర్ఐలతో సమావేశాలకు హాజరు అవుతూ.. తీరిక లేకుండా గడిపారు. ఇదే సమయంలో దిగ్గజ టెక్ కంపెనీల సీఈవోలతో రౌండ్ టేబుల్ భేటీలో పాల్గొన్నారు. న్యూయార్క్ లో మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ దీనిని నిర్వహించింది.


మోదీ ప్రభుత్వం వచ్చాక మేకిన్ ఇండియా నినాదం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్లే ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పుడు మేడ్ బై ఇండియా అంటూ మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాగా.. కొన్నేళ్లుగా ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలకు చెందిన భారతీయులు సీఈవోలుగా బాధ్యతలు చేపడుతున్నారు. వీరిలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అడోబ్ సీఈవో శంతను నారయణ్, ఎన్వీడియా సీఈవో జెన్సెన్ హాంగ్ వంటి వారున్నారు. మొత్తం 15 కంపెనీల సీఈవోలతో మోదీ సమావేశం అయ్యారంటే ఇంతమంది భారతీయులు సీఈఓలు అయ్యారా అనిపిస్తుంది.


మోదీ అభివృద్ధి చెందుతున్న భారతదేశం కోసం ఒక కొత్త నినాదం తెచ్చారు. అది హిందీ పదం పుష్ప్ ఇందులో పీ అంటే ప్రొగ్రెసివ్ ఇండియా, యు అంటే అన్ స్టాపబుల్ ఇండియా ఎస్ అంటే స్పిరిచ్యువల్ ఇండియ, హెచ్ అనేది హ్యూమానిటీ ఫస్ట్ ఇండియా చివరి ప అంటే ప్రెస్పెరస్ ఇండియా. డెలవర్ లో అధ్యక్షుడు బైడెన్ తో సమావేశంలో ఈ నినాదం ఇచ్చారు. రాజకీయాల్లోకి రాకముందు అమరికాలోని 29 రాష్ట్రాల్లో పర్యటించానని ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: