జగన్ సంచలన నిర్ణయం.. పార్టీని ముంచుతుందా? లేక మేలు చేస్తుందా ?

పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకుంటున్నారు. వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలకు పాత నేతలనే పంపుతున్నారు. ఇటీవల ముఖ్య  నేతలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.


2024 ఎన్నికలకు ఏడాది ముందు వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని సుమారు 70 నియోజకవర్గాలకు కొత్త అభ్యర్థులను ప్రకటించారు. సిట్టింగ్ లను కాదని.. ఇన్ ఛార్జిలను బాధ్యతలు అప్పగించారు. వారికే టికెట్లు కేటాయించారు. అయితే తర్వాత జరిగిన ఎన్నికల్లో వారందరూ బొక్క బోర్లా పడ్డారు. ఒక్కరు, ఇద్దరు తప్ప మిగిలిన వారందరూ ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు.  దీంతో  151 స్థానాల నుంచి వైసీపీ 11 స్థానాలకు పడిపోయింది.


సర్వేలు చేయించి.. జగన్ తీసుకున్న నిర్ణయం పార్టీలో చాలా మందికి నచ్చలేదు. కొందరు ధిక్కార స్వరం వినిపించగా.. మరికొందరు మాత్రం ఆయన చెప్పినట్లే కొత్త నియోజకవర్గాలకు వెళ్లి పోటీ చేశారు. అక్కడ ఫలితం తేడా కొట్టడంతో వారంతా అక్కడ ఉండలేక పాత నియోజకవర్గాలకు వెళ్లలేక జంక్షన్ లో ఉండిపోయారు. దీంతో  ఈ వ్యవహారంపై జగన్ దృష్టి సారించారు.


సీనియర్లతో జరిగిన సమావేశంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓడిపోయిన వారిని పాత నియోజకవర్గాలకు పంపాలని.. దీని కోసం నేతలకు విడివిడిగా మాట్లాడేందుకు జగన్ సిద్ధమవుతూ ఉండటంతో.. వారంతా ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్యూచర్ కోసం తమ కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నారు. పాత నియోజకవర్గాలకు వెళ్లితే తాము పార్టీని బలోపేతం చేయ్చగలమని.. జగన్ తీసుకున్న నిర్ణయం పార్టీకి ఊపిరి పోసిందని పలువురు మాజీ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. కాగా.. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడుతున్న క్రమంలో ఆ నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ ని పట్టించుకునే వారే కరవయ్యారు. దీంతో ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం ఏ మేరకు లాభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: