మోదీని ఇరుకున పెడుతన్న ఆ కేంద్ర మంత్రి? పక్కకు తప్పిస్తారా?
ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. మోదీ కంటే ముందే రాష్ట్ర మంత్రిగా మహారాష్ట్రలో పనిచేశారు. అలాగే జాతీయ రాజకీయల్లోకి వచ్చారు. 2009లో అద్వానీ నాయకత్వంలో బీజేపీ రెండోసారి ఓటమి పాలు అయినప్పుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఆయనే స్వీకరించారు. అది కూడా ఆర్ఎస్ఎస్ చలువతోనే. ఆయనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.
ఇన నితిన్ గడ్కరీ జాతీయ అధ్యక్షుడి ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. అంటే నితిన్ గడ్కరీ నాయకత్వంలో ఆయన పనిచేశారు. మోదీ 2013లో జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన మూడు సార్లు ప్రధాని అయ్యారు. కానీ బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ మాత్రం ఎప్పుడూ కాలేదు.
సాధారణంగా జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన వారికి ప్రధాని పదవి వస్తుంది. అలా నితిన్ గడ్కరీకి ఆశలు ఉన్నాయి. అయితే మోదీ మూడు విడతల ప్రభుత్వంలో గడ్కరీ కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే కేంద్రంలో కీలకంగా మాత్రం పెద్దగా లేకుండానే పరిమిత పాత్రకే పరిమితం అవుతున్నారు.
గడ్కరీకి పదవి అన్నది ఆర్ఎస్ఎస్ అభిమతం. అందుకే ఆయన్ను కొనసాగిస్తున్నారు. ఇక నాగ్ పుర్ లో ఉన్న ఆర్ఎస్ఎస్ కు అతి దగ్గరి వాడిగా సంఘ్ వి విశ్వాసపాత్రుడిగా ఉన్న నితిన్ గడ్కరీ తన ప్రధాని పదవి ఆశలపై ఇన్ డైరెక్ట్ గా బయట పెడుతున్నారు. ఇటీవల తనకి విపక్షం నుంచి ప్రధాని పదవి ఆఫర్ వచ్చిందని.. కానీ ఆ తరహా రాజకీయాలు తాను చేయలేనని కాబట్టే తిరస్కరించానని బాంబ్ పేల్చారు.
అంటే దాని అర్థం ప్రధాని స్థాయి వ్యక్తిని అని ఆ రేసులో ఉన్నాను అని చెప్పకనే చెప్పారని విశ్లేషకులు అంటున్నారు. మూడు సార్లు ప్రధాని అయిన మోదీ నాలుగో సారి కష్టమే అని అన్నారు. మహారాష్ట్రలో కేంద్ర మంత్రి రామ్ దాస్ అధవాలేతో కలిసి ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మళ్లీ గెలుస్తామో లేదో అనే డౌట్ పెట్టారు. వెంటనే మళ్లీ జోక్ చేస్తున్నా అని చెప్పారు. ఇది ఇండియా కూటమికి బలాన్ని ఇస్తుండగా.. మోదీకి మాత్రం లేనిపోని తలనొప్పులు తీసుకువస్తుంది.