కోవర్టులని పెట్టి రేవంత్ ని ఇబ్బంది పెడుతున్న కేటీఆర్?

కొంత కాలంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రెస్ మీట్ లో చేసిన డిమాండ్లు.. సాయంత్రానికి సర్కారు ఉత్తర్వులుగా వెలువడటం కనిపిస్తుంది. దీనిని బట్టి చూస్తుంటే ప్రభుత్వ యంత్రాంగంలోని వివిధ శాఖల్లో ఇంకా గులాబీ కోవర్టులు ఉన్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి.


ఏకంగా సీఎం నిర్వహించబోయే సమీక్షలు, అందులోని అంశాలు ముందుగానే ప్రతిపక్ష బీఆర్ఎస్ ముఖ్య నేతలకు తెలిసిపోతున్నాయన్న సందేహాలు కలుగుతున్నాయి. తాజాగా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. నిరుపేదలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వారి ఇళ్లను హైడ్రా కూలుస్తుందని పెద్దల ఇళ్లకు మాత్రం నోటీసులు ఇచ్చి అటువైపు కూడా కన్నెత్ని చూడటం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిన 40 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు ఖాళీగా ఉన్నాయని.. వాటిని హైడ్రా బాధితులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.


ఎలాంటి దిక్కు లేని నిరుపేదలే నాలాల పైన నిర్మాణాలు కట్టుకున్నారని.. అలాంటి వారిని గుర్తించి ప్రత్యామ్నాయ చూపిన తర్వాతనే వారి నిర్మాణాలు తొలగించాలని కోరారు. జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో రైలు మార్గం విస్తరణ ప్రధాన అంశాలుగా ఉన్నాయి.


మూసీ పరీవాహక ప్రాంత బఫర్ జోన్లో ఉన్న వారి వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. వారికి ప్రత్యామ్నయం చూపి నది పరీవాహకంలో నిర్మాణాలను తొలగించాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటలు, ఆక్రమణ వివరాలు తెలుసుకొని నివేదిక ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశం ముగిశాక సాయంత్రం మూసీ పరీవాహక నిర్వాసితులకు 16 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


ఉదయం కేటీఆర్ విలేకరుల సమావేశం పెట్టడం.. హైడ్రా బాధితుల సమస్యలను ప్రస్తావించడం, బీఆర్ఎస్ నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేయడం.. ఆ వెంటనే నిర్వాసితులకు వాటిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం వంటివి చూస్తుంటే పలు అనుమానాలు కలుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: