వార్నీ.. రేవంత్ భారీ ప్లాన్..! ఆరు గ్యారంటీలపై డైవర్ట్ పాలిటిక్స్?

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో వచ్చిన అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రజల్లో పాజిటివ్ తెచ్చుకునేందుకు నానా యాతన పడుతోంది. ఇందుకు ఏవేవో కొత్త కొత్త ప్రయోగాలకు తెర తీస్తోంది. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని నిర్మించే దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఎన్నికల వేళ ఆరు గ్యారంటీలను హామీలిచ్చింది.



ప్రజల కోసం ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పింది. కానీ.. ఇంకా ఆ గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. అటు రైతు భరోసా లేక రైతుల్లోను అసంతృప్తి కనిపిస్తోంది. ఇటీవల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ కు రాగా.. పీసీసీ చీఫ్ ఓ కొత్త నిభందన తీసుకువచ్చారు. ఇక నుంచి వారం లో రెండు రోజులు రాష్ట్ర మంత్రులు తప్పనిసరిగా గాంధీ భవన్ కు సందర్శించాలని కోరారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు.


కాగా ఈ విషయంపై పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డిలు కాసేపు చర్చించారు. ఈ కార్యక్రమం మంచిదే అయినా.. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సంబంధాలు కూడా బలపడతాయని సీఎం అన్నారు. ప్రతీ బుధ, శుక్రవారాల్లో మంత్రులు గాంధీ భవన్ కు సందర్శించాలని టైం నిర్ణయించారు.


ఇంత వరకు బాగానే ఉన్నా..కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను హామీలుగా ఇచ్చింది. అందులో కొన్ని స్కీములు అమల్లోకి రాలేదు. ముఖ్యంగా రైతుల కోసం రైతు భరోసా, మహాలక్ష్మి స్కీం అమలుకు నోచుకోలేదు. ఐతు భరోసా ద్వారా ఏటా రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. ఇక మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ.2500 చొప్పున ప్రతి నెలా ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. వీటి నుంచి ప్రజలకు డైవర్ట్  చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి ప్రయోగాలకు తెర తీస్తున్నారు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు.. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. వాటిలో లబ్ది పొందడానికేనా అనే టాక్ కూడా నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: