ఏపీకి కేంద్రం మరో ఆఫర్..! చంద్రబాబు జారిపోకుండా మోదీ జాగ్రత్త పడుతున్నారా?

కేంద్రంలో, రాష్ట్రంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాలే ఏర్పడిన తర్వాత ఏపీ అభివృద్ధికి త్వరితగతిన అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనులు ఎటువంటి జాప్యం లేకుండా జరుగుతున్నాయి. కేంద్రం నుంచి ఏపీకి ఫుల్ సపోర్టు లభిస్తోంది. ఇలా ఎన్నో ప్రాజెక్టులు కార్యరూపం దాల్చుతున్నాయి. ఈక్రమంలో మరో కొత్త ప్రాజెక్టు ఏపీకి రానుంది. మచిలీపట్నం నుంచి రేపల్లెకి కొత్తగా రైల్వే లైను నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నారు.


 దీనికి సంబంధించి మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాల శౌరి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని కలిశారు. రైల్వే లైను ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి లాభాలు ఒనగూరుతాయి? ఏయే ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుంది. విజయవాడ రైల్వే స్టేషన్ పై ఎలాంటి ఒత్తిడి తగ్గుతుంది. సరకు రవాణాలో ఎలాంటి లాభాలున్నాయి? మచిలీపట్నం నుంచి రొయ్యలు, చేపలు చెన్పైకి రవాణా చేయడానికి ఏ విధంగా మార్గం సుమగం అవుతుంది. తదితర విషయాలను వివరించి  చెప్పారు.


ఒక ప్రాజెక్టు రిపోర్టుతో ఎంపీ మంత్రిని కలిశారు. మచిలీపట్నం నుంచ ఇతెనాలి వెళ్లాలంటే గుడివాడ, విజయవాడ మీదుగా 120 కి.మీ. ప్రయాణించాల్పి వస్తుంది. అలా కాకుండా ఈ ప్రాజెక్టు రావడం వల్ల కేవలం 45 కి.మీ. దూరంతోనే చేరుకోవచ్చు. తెనాలి చెన్నై వైపు విజయవాడ వైపు కీలక మార్గంలో ఉందనే విషయాన్ని చెప్పారు.


రైల్వే లైను నిర్మాణ సాధ్యాసాధ్యాలను తెలుసుకొని అవసరమైన వనరులు సమకూరుస్తామని మంత్రి తర్వాత ఎంపీకి లేఖ రాశారు. దీనిబట్టి త్వరలోనే రైల్వే లైను పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఎంపీ బాలశౌరి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే గతంలో మచిలీ పట్నం, ధర్మవరం రైలుని రద్దు చేశారని.. ఇది తిరుపతి మీదుగా ప్రయాణించేదని.. దీనిని పునరుద్ధరించాలని ఎంపీ కోరుతున్నారు. అయితే గతంలోను కూడా ఇదే విషయాన్ని ఎంపీ కోరగా.. మచిలీ పట్నం నుంచి తిరుపతి వరకు రైలును నడిపిస్తున్నారు. అలా కాకుండా ధర్మవరం వరకు నడిపించాలని ఎంపీ పట్టుబడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: