కశ్మీర్ లో గెలిచేది బీజేపీయేనా?

కాశ్మీర్ ని ఏలాలని బీజేపీ కోరిక. అది దశాబ్దాల నాటిది. మొత్తం భారత దేశానికి తిలకంగా ఉండే ప్లేస్ లో కశ్మీర్ ఉంటుంది. యాపిల్స్ కి పెట్టింది పేరు. పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్. వ్యూహాత్మకంగా ప్రాంతం. అలాగే దేశం మొత్తానికి ఒక అందమైన యాపిల్ లాంటి ప్రాంతం. అలాంటి కాశ్మీర్ ని ఎలాంటి ఎవరికి ఉండదు. బీజేపీకి అయితే ఇంకా ఉంటుంది. బీజేపీ దేశాన్ని జయించింది కానీ కశ్మీర్ ని అందుకోలేకపోతుంది.


ఇక 2019లో 370 ఆర్టికల్ ని రద్దు చేసి కాశ్మీర్ లో గవర్నర్ ద్వారా పరోక్ష పాలన సాగించింది. ఇప్పుడు ప్రజల ఓట్లతో తొలిసారి అధికారంలోకి రావాలని చూస్తోంది. ఇక కశ్మీర్ లో రాజకీయం చూస్తే బీజేపీకి అందకుండానే ఉంది. పైగా మొత్తం 90 సీట్లకు గాను బీజేపీ పోటీకి పెట్టిందే 62 చోట్ల మాత్రమే.  ఇందులో నుంచే మ్యాజిక్ ఫిగర్ 46 రావాలి. అంటే దాదాపు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవాలి.


ఆ అద్భుతం బీజేపీ వల్ల సాధ్యమా అన్నది చర్చ. జమ్మూ లో అయితే బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయని అంటున్నారు. కానీ కాశ్మీర్ లో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ ప్లస్ కాంగ్రెస్ కూటమిదే పై చేయి అని అంటున్నారు. అక్కడే ఎక్కువ సీట్లు ఉన్నాయి. మొత్తం 47 సీట్లలో కూటమి 90 శాతం పైగా గెలచుకున్నా అధికారం వారిదే. జమ్మూలో కాంగ్రెస్ కే సీట్లు వస్తాయని అంటున్నారు. ఈ లెక్కన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వారు ధీమా గా ఉన్నారు.


కానీ మోదీ లెక్కలు వేరే ఉన్నాయి. ఇటీవల జరిగిన ప్రచార సభలో మాట్టాడుతూ.. జమ్మూ కశ్మీర్ లో ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని.. ఈ సారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అంటున్నారు. మొత్తం మీద జమ్మూలో ఎన్నికలపై ప్రధాని ధీమాగా ఉన్నారు. బీజేపీకి కనీసం 35 సీట్లు వస్తే.. ఆ మిగిలిన పదకొండు ఏదో విధంగా సాధించి అయినా పీఠం ఎక్కాలని బీజేపీ స్కెచ్ గీస్తోంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: