మళ్లీ వచ్చిన మాధవీ లత.. ఈ సారి ఇచ్చి పడేస్తున్న వైసీపీ ?

తిరుమల లడ్డూ వివాదం తెరపైకి వచ్చాక వైసీపీపై ఏపీ బీజేపీ నేతల కంటే తెలంగాణకు చెందిన కాషాయ నేతల దాడి ఎక్కువైంది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ తో పాటు వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. ఈ క్రమంలో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత చేస్తున్న మాటల దాడిపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు.


మాధవీ లత హైదరాబాద్ నుంచి వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో భజన చేసుకుంటూ మరీ తిరుపతి వచ్చారు. ఆ తర్వాత వైసీపీపై, మాజీ సీఎం జగన్ పై విమర్శల దాడి కొనసాగించారు. అయితే ఆమెపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మాధవీలత తీరుపై ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ పరోక్షంగా స్పందించారు. తెలంగాణ బీజేపీ నేతల్ని తీసుకొచ్చి మరీ తమపై విమర్శలు, నిరసనలు చేయిస్తున్నారని మండిపడ్డారు.  ఇప్పుడు వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కూడా స్పందించారు.


తెలంగాణ నుంచి బీజేపీ నేత ఒకావిడ భజన చేసుకుంటూ మరీ వచ్చారు. ఇదంతా దిక్కుమాలిన తనం అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చేతనైతే నీ ఆసుపత్రిలో భజన  చేయమంటూ ఫైర్ అయ్యారు. కరోనా సమయంలో నీ ఆసుపత్రిలో హిందువులకు పైసా అయినా తగ్గించావా అని ప్రశ్నించారు. నీ ఆసుపత్రి బాగోతాలు మాకు తెలియదా అని మండిపడ్డారు.


ఎక్కడో ఓవైసీ ఆసుపత్రిలో తగ్గించలేదని ఆమె అడుగుతోంది. ఇంతకీ తన హాస్పిటల్ లో హిందువులకు ఏమైనా పైసా తగ్గించారా అని అడిగారు. గతంలో ఏపీ గవర్నర్, ప్రధాని మోదీతో పాటు జగన్ తిరుమల వెళ్లారని అప్పుడు బీజేపీ నేతలు ప్రశ్నించారా అని మండిపడ్డారు. ఈ రాష్ట్రం కానీ వాళ్లు కూడా హిందువుల గురించి, గుడి గురించి, మతం గురించి మాట్లాడతారా అని ప్రశ్నించారు. మరి దీనిపై ఆమె ఏం స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: