పాపం.. ఆ పని కోసం చెమటోడుస్తున్న జగన్..?

తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. వైసీపీ నుంచి పోయేవారే తప్ప.. ఆ పార్టీలోకి వచ్చే నాయకులు అంటూ ఎవరూ కనిపించడం లేదు. పైగా కీలక కూసాలు వంటి నాయకులు కదిలిపోయారు. బాలినేని, ఉదయభాను, వంటి వారు పొరుగు పార్టీల్లోకి మారిపోగా.. ఆళ్ల నాని వంటి వారు సైలెంట్ అయిపోయారు. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. ఆయా విషయాలపై పార్టీ అధినేత జగన్ చింతించారో లేదో చెప్పడం కష్టమే. ఎందుకంటే పార్టీని కార్పొరేట్ స్థాయిలో ఆయన నడిపిస్తున్నారు.


ఇక నిన్న మొన్నటి వరకు పరిస్థితి ఎలా ఉన్నా… ఇప్పుడు చేతులు కాలిపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో హుటాహుటీన పార్టీ డెవలప్ మెంట్ పై జగన్ దృష్టి సారించారు. తాజాగా నిర్వహించిన పార్టీ నేతల సమీక్షా సమావేశంలో పార్టీని ఏ విధంగా అభివృద్ధి చేయదలచింది ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచ స్థాయిలో ఏ పార్టీ కూడా లేని విధంగా తమ పార్టీని ఉంటుందని పేర్కొన్నారు.


క్షేత్ర స్థాయిలో ఎంతో మందికి అవకాశం ఇచ్చామని.. ఇప్పుడు అదే చేస్తున్నట్లు తెలిపారు. కానీ వాస్తవం.. చూస్తే పదవులు తీసుకున్నవారు.. రాని వారు ఇద్దరూ దూరం అయ్యారు. ఇదీ ఇప్పుడు వైసీపీ పరిస్థితి. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అనేక మంది నాయకులు సైలెంట్ గానే ఉన్నారు. పార్టీ అధినేత పట్ల విధేయతను కూడా చూపించలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో పార్టీ డెవలప్ మెంట్ అంటే కేవలం నాలుగు మీటింగులు, నాలుగు పదవులు పంచడం కాదనేది వాస్తవం.


ఇది వర్క్ అవుట్ అయ్యే పరిస్థితి కూడా కాదని విశ్లేషకులు అంటున్నారు. జగన్ తనకు తాను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తన్నారు. అదే సమయంలో క్షేత్ర స్థాయి కేడర్ కు మరింత చేరువ కావాలి. నాయకులకు అందుబాటులో ఉండాలి. ఏ సమస్య వచ్చినా.. మధ్య వర్తుల ప్రమేయం లేకుండా కాచుకునేలా వ్యవహరించాలి. అప్పుడు కానీ పార్టీ ప్రగతి బాట పట్టే పరిస్థితి ఉండదని విశ్లేషకులు అంటున్నారు.  అసలు మార్పు ప్యాలెస్ లోనే జరగాలన్నది వాస్తవంగా వారు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: