చైనాని అలా దెబ్బ కొట్టిన మోదీ? చీకట్లో డ్రాగన్ కంట్రీ?

బతుకమ్మ మొదలైంది. ఈ ప్రకారం పండుగ సీజన్ ప్రారంభమైనట్లే. ఈ నవరాత్రి వేడుకలను దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు. ఒక్కో ప్రాంతంలో తక్కువ తీరుగా నిర్వహిస్తుంటారు. దసరా, దీపావాలి, చాట్ పూజలతో భారతదేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఈ పండుగల వేళ ప్రధాని మోదీ ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్టాడారు.


ఈ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మనం నిర్వహించుకునే పండుగలకు, మనం తయారు చేసే వస్తువులను మాత్రమే వాడాలని దేశ ప్రజలకు పిలుపినిచ్చారు. అయితే మోదీ చేసిన వ్యాఖ్యలను జాగ్రత్తగా పరిశీలిస్తే.. అవి చైనాకు చెక్ పెట్టేలా ఉన్నాయని తెలుస్తోంది. త్వరలో జరుపుకొనే దీపావళి పండుగను మేడ్ ఇన్ ఇండియా వస్తువులతోనే నిర్వహించుకోవాలని ప్రధాని పిలుపినిచ్చారు. ఇటీవల గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లోను దేశీయంగా తయారైన వస్తువులనే మెజార్టీ ప్రజలు వినియోగించారు. దీంతో చైనా నుంచి దిగుమతి అయ్యే వివిద రకాల వస్తువులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.


దాన్ని మరువక ముందే నరేంద్ర మోదీ దీపావళి పండుగుకు ఉపయోగించే ప్రమిదల నుంచి మిఠాయిల వరకు స్థానికంగా తయారైనవే వాడాలని సూచించారు. వాస్తవానికి మన దేశంలో పండుగల సమయంలో చైనా నుంచి విచ్చలవిడిగా వస్తువులు మార్కెట్లో దర్శనమిస్తాయి. ఆ వస్తువులు అత్యంత తక్కువ ధరలో లభిస్తాయి. వాటికి స్థానికంగా డిమాండ్ ఉంటుంది. అయితే వాటి వల్ల స్థానికులకు ఉపాధి కరవవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర  ప్రభుత్వం మేడిన్ ఇండియా,మేక్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యం ఇస్తోంది.


అందులో భాగంగానే చైనా వస్తువులను నిషధం విధించింది. లోకల్ మేడ్ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించింది. నేరుగా ప్రధాని మోదీ స్థానికంగా ఉత్పత్తులనే వాడాలని కొనుగోలు చేయడాలని పిలుపునివ్వడం మొదలు పెట్టారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని ఆయన తెరపైకి తెచ్చారు. అయితే గత ఏడాది లాగే ఈ ఏడాది కూడా మేకింగ్ ఇండియా ఉత్పత్తులను వాడాలని మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ పిలుపునిచ్చారు. దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని.. లాభాలు కూడా బాగున్నాయని వ్యాపారులు అంటున్నారు. పైగా చైనా వస్తువులు నాణ్యంగా లేకపోవడంతో ప్రజలు వాటిపై ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: