తెలంగాణ ప్రజలకు షాక్ ఇస్తున్న రేవంత్? సైలెంట్ గా ఒక్కో పథకం లేపేస్తున్నారుగా?

గత దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. ఆ ప్రభుత్వ హయాంలో పలు ప్రజాకర్షక పథకాలు అమలు అయ్యాయి. అయితే పది నెలల క్రితం.. అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని స్కీములకు మంగళం పాడుతున్నట్లు కనిపిస్తోంది. ఓ వైపు నిధుల లేమి.. మరోవైపు ఆ స్కీముల్లో అవకతవకలు జరిగాయంటూ సీఎం రేవంత్ రెడ్డి వాటిని ఈజీగా డైవర్ట్ చేస్తున్నారు.


అలా ప్రజలకు సైతం అనుమానం రాకుండా.. ఒక్కో పథకం నుంచి భారాన్ని తగ్గించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడో ఉన్న మహిళలంతా తమ తల్లిగారింటికి చేరుకొంటారు. తొమ్మిది రోజుల పాటు మహిళలంతా ఒక దగ్గరికి చేరి పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడిపాడుతుంటారు.


ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలోని మహిళలందరికీ చీరలను కానుకగా ఇచ్చేది. రేషన్ షాపుల ద్వారా ఈ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. కానీ రేవంత్ ప్రభుత్వం దీనికి మంగళం పాడింది.


ఇక రైతులకు ఎంతగానో ఉపయోగపడే రైతు బీమాకు రేవంత్ సర్కారు బైబై చెప్పినట్లే తెలుస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కల్యాణ లక్ష్మి డబ్బులతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటించింది. కానీ ఇప్పుటి వరకు దాని ఊసే లేదు. ఇంకా గొర్రెల పంపిణీ, దళితబంధు, బీసీ బంధు పథకాల గురించి మాట్లాడుకోవడమే మర్చిపోయారు. వీటితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం గురించి ప్రభుత్వం ఎక్కడా మాట్లాడటం లేదు. ఏమైనా అంటే నిధులు లేవని రేవంత్ సర్కారు చెబుతోంది. ఉన్న డబ్బులను రుణమాఫీకే సర్దుబాటు చేశారని.. అందుకే రైతు భరోసా తదితర పథకాలను అమలు చేయడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: