కాంగ్రెస్ వైపు చూస్తున్న వైసీపీ.. ! ఆ విషయంలో రాహుల్ కి మద్దతుగా జగన్?

ఇటీవల ఎన్నికల్లో ఏపీలో వైసీపీ 40 శాతం ఓటు బ్యాంకు సంపాందించుకుంది. కానీ  కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. అధికారం దక్కించుకోవాల్సిన చోట కేవలం 11 సీట్లకు దక్కించుకోవడం వెనుక ఈవీఎంలలో మతలబు జరిగి ఉంటుందని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తొలి రోజు నుంచే వైసీపీ ఈవీఎం రాగం అందుకుంది.


అప్పట్లో మాజీ మంత్రి రోజా ఒక అడుగు ముందుకేసి జనసేన పోటీ చేసిన అన్ని సీట్లలో గెలవడం ఏంటి? భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో విజయాలు సాధించడం ఏంటి? తెలుగుదేశం పార్టీకి ఆ స్థాయిలో ఓట్లు రావడం ఏంటి? 40 శాతం ఓట్లు దక్కించుకున్న వైసీపీ 11 సీట్ల వద్దే ఆగిపోవడం ఏంటి అంటూ సంచలన ఆరోపణలు చేశారు.


ఆ తర్వాత వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఈవీఎం సీఎం అంటూ చంద్రబాబుపై ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇక వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమయం దొరికినప్పుడల్లా ఏపీలో ఓట్ల లెక్కింపు, మెజార్టీ, దక్కిన సీట్లపై తనదైన విశ్లేషణలు చేస్తూనే ఉన్నారు. తన ఛానల్, పత్రికలో ఈవీఎం లపై రకరకాల కథనాలు ప్రసారం చేస్తూనే ఉన్నారు. అయితే దీనిని కూటమి నేతలు  సమర్థంగా తిప్పి కొడుతున్నారు. తాజాగా హరియాణా ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ కు ఆయాచిత వరం లభించినట్లయింది.



తాజాగా హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలను వ్యక్తం చేసింది. ఇక జగన్ కూడా వీరికి మద్దతుగా ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంకా బ్యాలెట్ పేపర్ నే ఉపయోగిస్తున్నారు. మనం కూడా బ్యాలెట్ వైపు వెళ్తేనే ఓటర్లలో విశ్వాసం నింపినవారిమి అవుతాం అని ట్వీట్ చేశారు. అయితే జగన్ కాంగ్రెస్ కు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని.. అందులో భాగంగానే ట్వీట్ చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: