నారా లోకేశ్ స్పీడ్ కి బ్రేకులు వేస్తున్నది ఎవరు?

ఏపీలో మంగళగిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. రాజధాని అమరావతి పరిధిలోని ఈ నియోజకవర్గానికి లోకేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏపీ మంత్రి కూడా. 2019 ఎన్నికల్లో తొలిసారిగా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.


2024 ఎన్నికల్లో సైతం మంగళగిరి నియోజకవర్గాన్నే ఎంచుకున్నారు లోకేశ్. దీంతో జగన్ స్ర్టాటజీ మార్చారు. మరోసారి లోకేశ్ నె దెబ్బతీయాలని గట్టి ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా బీసీ మహిళా అభ్యర్థిని బరిలో దింపారు. కానీ లోకేశ్‌ ఏకపక్ష విజయం సాధించారు. రికార్డు స్థాయిలో 90 వేలకు పైగా మెజార్టీ సాధించారు. ఇప్పుడు లోకేశ్  తన దైన శైలిలో ముందుకు సాగుతున్నారు. రెడ్ బుక్ పేరిట వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో లోకేశ్ ను కట్టడి చేయడం జగన్ కు కష్టతరంగా మారింది.


పైగా గెలిచిన దగ్గర నుంచి ఆయన నియోజకవర్గంలో బాగా యాక్టివ్ అయ్యారు. చాలా క్రియాశీలకంగా ఉన్నారు. ప్రజా దర్బార్ నిర్వహిస్తూ.. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రతిరోజు వారికి అందుబాటులో ఉంటున్నారు. అక్కడి కక్కడే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. ఇప్పుడు లోకేశ్ ని ఎలా కట్టడి చేయాలో జగన్ ఇప్పటి నుంచే వ్యూహాలు పన్నుతున్నారు.


2019  ఎన్నికల్లో లోకేశ్ ను ఓడించేందుకు జగన్ బాగానే కసరత్తులు చేసి విజయవంతం అయ్యారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా తనదైన వ్యూహంతో ముందుకు సాగారు కానీ 2024లో జగన్ బీసీ వ్యూహం బెడిసి కొట్టింది. పద్మశాలీలు ఎక్కువగా ఉన్నారని.. అదే సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన్ను తప్పించి బీసీ అభ్యర్థి మురుగు లావణ్యతో పోటీ చేయించారు. అయినా ఓటమి తప్పలేదు. ఇప్పుడు ఎన్నికల అనంతరం లోకేశ్ ను నియంత్రించేందుకు వేమారెడ్డిని కొత్తగా నియమించారు జగన్. ఎన్నికల ముందు బీసీ నినాదందో ముందుకు పోగా.. ఇప్ఉడు మరోసారి సొంత సామాజిక వర్గాన్ని తనపైకి తెచ్చారు. కనీసం వేమారెడ్డి అయినా నారా లోకేశ్ దూకుడుకు అడ్డుకట్ట వేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: