మళ్లీ పుంజుకుంటున్న బీఆర్ఎస్..! కేకే సంచలన సర్వే?

కేకే సర్వే సంస్థ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్  ఫలితాలు నూటికి 200 శాతం నిజం అయ్యాయి. అన్నీ సర్వేలు వైసీపీ గెలుస్తుందని చెబితే.. కేకే సర్వే మాత్రం వైసీపీ 11 స్థానాలకే పరిమితం అవుతుందని తెలిపింది. టీడీపీ కూటమికి 164 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది. అచ్చం ఇవే ఫలితాలు వచ్చాయి.


దీంతో కేకే సర్వేపై చాలా మందికి నమ్మకం కలిగింది. కానీ ఇటీవల జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కేకే సర్వే అంచనాలు తలకిందులు అయ్యాయి. హరియాణాలో  100 శాతం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. కేకే సర్వేనే కాదు.. ఇంకా అనేక సర్వేలు అన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. కానీ బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. ఇదిలా ఉంటే.. కేకే సర్వే తాజాగా తెలంగాణలో నిర్వహించిన సర్వే రిపోర్టును విడుదల చేసింది. ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా పాలన తీరు, ప్రతిపక్ష పార్టీల పరిస్థితిపై సర్వే నిర్వహించింది.


తెంలగాణలో రేవంత్ రెడ్డి సర్కారు పనితీరుపై కేకే సర్వే సీఈవో కిరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ విషయంలో రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎల్లప్పుడూ సీఎం అలర్ట్ గా ఉండాలని సూచించారు. తెలంగానలో ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో సమర్థవంతంగా పని చేస్తుందని చెప్పారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోను బీఆర్ఎస్ తక్కువ మెజార్టీతోనే ఓడిందని గుర్తు చేశారు.


అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ బలపడుతోందని కిరణ్ తెలిపారు. ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడినా కేసీఆర్ కే ఏ నష్టం లేదన్నారు. 80 శాతం ఓటర్లు బీఆర్ఎస్ నాయకత్వంపై నమ్మంతోనే ఉన్నారని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు, నేతలను చూసి ఓటు వేయరని.. నాయకత్వంపై నమ్మకంతోనే ఓట్లు వేస్తారని తెలిపారు. ఇక తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ అని.. కనుచూపు మేరలో కూడా బీజేపీ కనిపించడం లేదని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kk

సంబంధిత వార్తలు: