జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు? నిజంగా బంగారు బాతేనా?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఇవన్నీ తెలియనవి కావు. రాజకీయాల్లో తాడు పాముల మధ్య తేడాలు కూడా ఆయనకు బాగా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లోను ఆయన కళ్లారా అన్నీ చూశారు. ఇప్పటికీ రెండేళ్ల క్రితం ఏకంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగింది. అంతే కాదు ఉండవల్లిలోని చంద్రబాబు బాబు నివాసం మీద కూడా దాడి జరిగింది.


ఈ సమయంలో ఏపీ అట్టుడికింది. ఏపీలో ప్రతిపక్ష పార్టీలకు తగిన స్థానం లేదని వారి స్వేచ్ఛకు భంగం కలుగుతుందని ఏకంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాలని భావించి ఆనాడు చంద్రబాబు దిల్లీ బయల్దేరి వెళ్లారు. అయితే అక్కడ చంద్రబాబు కొన్ని రోజుల పాటు ఉండి కేంద్ర హొం మంత్రి అమిత్ షా అపాయిట్ మెంట్ కోసం ప్రయత్నం చేసినా అది దొరకలేదు అని ప్రచారంలో ఉన్న మాట. ఆ తర్వాత చంద్రబాబు వెనక్కి వచ్చేశారు.


ఆ తర్వాత ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో కూడా గడిపారు. ఇవన్నీ ఎందుకు అంటే రాజకీయాలు ఇలాగే ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఆయన దిల్లీ వెళ్తే చాలు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఆయన్ను నెత్తిన పెట్టుకుంటున్నారు కేంద్ర పెద్దలు. దాదాపుగా యాభై ఏళ్ల రాజకీయాన్ని పండించుకున్న చంద్రబాబు ఫక్తు పొలిటిషయన్. ఆనాడు ఎందుకు అలా జరిగింది..ఇప్పుడు పరిస్థితులు ఇలా  ఎందుకు ఉన్నాయి అనేది ఆయనకు సులువుగా తెలుస్తుంది.


ఈ రోజున జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు బలమైన నేతగా ఉన్నారు. అంతే కాదు శక్తిమంతుడిగా ఉన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఎత్తులు వేయగల సామర్థ్యం ఉన్ననేత.  ప్రస్తుతం ఎన్డీయే సర్కారు ను చంద్రబాబు తన భుజ స్కంధాలపై మోస్తున్నారు. ఆయన తలుచుకుంటే ప్రభుత్వాలే మారుతాయి అని విశ్లేషకులు అంటున్నారు. అయితే రాజకీయాల్లో ఎప్పుడెలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే చంద్రబాబు కి రాచమర్యాదలు చేస్తున్నారు బీజేపీ పెద్దలు. దానికి తోడు జమిలి ఎన్నికల అన్న పెద్ద ఎజెండా ఉంది.  మిత్రుల్లో చంద్రబాబు అత్యంత విధేయుడిగా ఉన్నారు. అంతే కాదు ఇప్పుడు ఆయన తులసీదళంగా మారారు. ఆయన ఎటువైపు మొగ్గితే వారిదే అధికారం. అందుకే ఈ మర్యాదలు అన్నీ.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: