బీఆర్ఎస్ కి అసలు టైం కలిసి రావడం లేదా? కేసీఆర్ ని ప్రజలు ఎందుకు పట్టించుకోవడం లేదు..!
అది ఫ్యామిలీ పార్టీ అయినా పెద్ద కేసుగానే ప్రచారం జరిగింది. ఫ్యామిలీ కోసమే రాజ్ పాకాల ఈ పార్టీని ఏర్పాటు చేశాడు. దీనిపై కేటీఆర్ కూడా క్లారిటీ ఇచ్చాడు. కానీ.. ప్రచారం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇంతటి వ్యతిరేక ప్రచారం రావడానికి కారణాలూ లేకపోలేదు. 'మనం ఏది చేస్తా.. మనకు అదే వస్తుంది' అన్నట్లుగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రాజకీయమే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే కొలువుదీరిందో అప్పటి నుంచి రాజకీయాలు ఇంట్రస్టింగ్‌గా మారాయి. రాజకీయ ప్రత్యర్థుల్ని ట్రాప్ చేయడం లేదంటే బ్లాక్ మెయిల్ చేయడం వంటి రాజకీయాలు చాలా వరకు పెరిగిపోయాయి. కేసులు నిర్ధారణ కాకున్నా కొంత మందిని అరెస్టు చేసి రోజుల తరబడి జైళ్లో పెట్టిన దాఖలాలు ఉన్నాయి. అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ నేతలు.. అందరూ ఈ బాధలు అనుభవించారు.
రాష్ట్రంలో ఓ నాయకుడి వాయిస్ కాస్త గట్టిగా వినిపిస్తున్నది అంటే.. అతడిని గత బీఆర్ఎస్ హయాంలో తొక్కిపెట్టే ప్రయత్నమే జరిగిందని చెప్పాల్సిందే. పేపర్ లీకేజీ విషయంలో బండి సంజయ్ కుమార్‌ను అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కీలక అరెస్టులు ఉన్నాయి. పదేళ్ల కాలంపాటు అధికారంలో ఉన్నామని అడ్డగోలు రాజకీయాలు బీఆర్ఎస్ చేసింది. అవన్నీ ఇప్పుడు రాష్ట్రంలో మరోసారి చర్చకు వచ్చాయి. దాంతో ఇప్పుడు గులాబీ పార్టీకి కనీసం సానుభూతి దొరకని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాజ్ పాకాల కేసు విషయంలోనూ ఎవరూ పెద్దగా వ్యతిరేకించడంలేదు. గతంలో చేసిన వాటికి ఈ మాత్రం ఎదుర్కోక తప్పదనే కామెంట్స్ వినిపిస్తుండడం బీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతను తెలుపుతోంది.