వైసీపీ 151 సీట్ల మిస్టరీ చెప్పిన బ్రదర్ అనిల్.! రీజన్ ఆయనేనట?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన సరస్వతీ ఇండస్ర్టీస్ వ్యవహారం ఇప్పుడు రాజకీయాల్లో దుమారం రేపుతోంది. వైఎస్ షర్మిల వ్యవహారాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పుపడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడితో కలిసి జగన్‌ను జైలుకు పంపించేలా కుట్ర పన్నిందంటూ ఆరోపిస్తోన్నారు.


తాజాగా షర్మిల భర్త, ప్రముఖ ఎవాంజలిస్ట్ బ్రదర్ అనిల్ కుమార్ మాట్లాడారు.  వైసీపీ నాయకులు చేస్తోన్న ఆరోపణలను తిప్పికొట్టారు.  ఆస్తుల కోసం జగన్ తన తల్లి, చెల్లినీ లెక్క చేయట్లేదంటూ మండిపడ్డారు.  ఆస్తుల కోసం ఎందాకైనా వెళ్తాడని, వారిద్దరిపై పిటిషన్లు వేయడం దీనికి ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...  తన ఆస్తులన్నీ హైదరాబాద్‌లోనే ఉండటం వల్ల ఇబ్బందులు వస్తాయని తెలంగాణలో షర్మిలతో పార్టీ పెట్టించడానికి జగన్ అడ్డుకున్నారని ఆయన చెప్పారు. తీరా ఆమె ధైర్యం చేసి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు సాక్షిలో అడ్వర్టయిజ్‌మెంట్ కూడా ఇవ్వడానికి జగన్ అంగీకరించలేదని విమర్శించారు.


వైఎస్ విజయమ్మ జోక్యం చేసుకొని, అడ్వర్టయిజ్‌మెంట్‌కు ఖర్చులు భరిస్తామని చెప్పినా ఒప్పుకోలేదని పేర్కొన్నారు. ఏపీలో అధికారంలోకి రావడానికి తమను అన్ని రకాలుగా వినియోగించుకున్నారని, తీరా సీఎం అయిన తరువాత జగన్ తమను పక్కన పెట్టాడని మండిపడ్డారు. అప్పుడే జగన్ నిజ స్వరూపం బయటపడిందని చెప్పారు.  జగన్ స్వార్థపరుడు అని అందుకే కుటుంబ సభ్యులపై పిటిషన్లు వేశారని అన్నారు.


2019 నాటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు తన వల్లే వచ్చాయని బ్రదర్ అనిల్ అన్నారు. అది- తన నంబర్‌గా అభివర్ణించారు. తన మొబైల్, కారు నంబర్ అన్నీ కూడా 151తోనే ఉంటాయని వివరించారు. జీసస్ క్రైస్ట్ అని లెక్కబెడితే 151 అనే అంకెలు వస్తాయని, దేవుడు ఆ నంబర్‌ను తనకు మాత్రమే ఇచ్చాడని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దేవుడి రాజ్యాన్ని నిర్మించడానికి తనకు అదృష్టంగా 151 సంఖ్య లభించిందని, అదే నంబర్‌తో 2019 నాటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీ సీట్లు లభించాయని గుర్తు చేశారు.  తాను చేసిన ప్రార్థనలను దేవుడు ఆలకించడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ అని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: