తెలంగాణ రియల్ ఎస్టేట్ ని అమరావతి దెబ్బ తీస్తుందా?
వాస్తవానికి దేశవ్యాప్తంగా రియల్ వ్యాపారం ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. హైడ్రాను బూచిగా చూపి కొందరు తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. వాస్తవానికి రియల్ వ్యాపారం చెరువులు, కుంటల్లో జరగడం లేదు. కొన్ని సంస్థలు, కొంత మంది వ్యాపారులు మాత్రమే చెరువులు, కుంటలను ఆక్రమించి ప్లాట్లుగా మార్చి విక్రయించారు. వాటిని కొన్నవారే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు ఎక్కడా తగ్గలేదని, పెట్టుబడిదారులు అమరావతికి తరలి పోవడం లేదని పేర్కొంటున్నారు. కొంత మంది హైదరాబాద్‌తోపాటు అమరావతిలోనూ పెట్టుబడి పెడుతున్నారని చెబుతున్నారు. హైదరాబాద్ అంటే ఓ బ్రాండ్ . ఇది ఓవర్‌నైట్‌తో రాలేదు. అనేక మంది సీఎంల కృషితో వచ్చింది. హైరదాబాద్ సెంటర్ పాయింట్. అన్ని ఐటీ కంపెనీలకు నెలవు. అమెరికా తర్వాత అంతటి ప్రాధాన్యత హైదరాబాద్‌కే ఉంది. సైన్యానికి అందించే ఆయుధాలు, పరికరాలు, డ్రోన్ కెమెరాలు ఈవీఎంలు హైదరాబాద్‌లోనే తయారవుతాయి.
హైదరాబాద్ పెట్టుబడులకు అనుకూలించే మరో అంశం భౌగోలిక పరిస్థితి. ఇక్కడి నుంచి దేశంలోని ఏ ప్రాంతంంలోకి అయినా వెళ్లే ఆవకాశం ఉంది. ఇక్కడ వరదలు వచ్చే అవకాశం కూడా తక్కువ. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ పెట్టుబడి పెట్టినవారు ఉప సంహరించుకునే పరిస్థితి ఉండదు. సీఎంలు ఎంత మంది మారినా రియల్ వ్యాపారం మాత్రం తగ్గలేదు.హైదరాబాద్‌తో పాటు అమరావతి కూడా అభివృద్ధి చెందాలన్న ఆలోచనలో అక్కడ పెట్టుబడికి ముందుకు వస్తున్నారు. హైడ్రా కారణంగా వ్యాపార తగ్గిందన్న వాదనలో నిజం లేదు. ప్రస్తుత పరిస్థితి, స్తబ్ధత తాత్కాలికమే అని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. త్వరలోనే అన్నీ సర్ధుకుంటాయని చెబుతున్నారు.