వారిపై చంద్రబాబుకి ఏ మాత్రం కోపం తగ్గలేదు గా? అవకాశం కోసం ఎదురుచూస్తున్న బాబు?

వైసీపీ నేతలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ''వాళ్లను వదిలి పెట్టను'' అని గట్టిగా తేల్చి చెప్పారు. హద్దులు దాటి వ్యవహరించిన ఏఒక్కరినీ వదిలేది లేదన్నారు. ఎన్నికలకు ముందు అనేక రూపాల్లో టీడీపీ నాయకులను ఇబ్బంది పెట్టా రని.. వారిని వదిలి పెట్టబోనని చెప్పారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్ట ప్రకారం శిక్షించి తీరుతామని హెచ్చరించారు. శ్రీకాకు ళంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన `సూపర్ సిక్స్‌` అమలు కార్యక్రమ బహిరంగం సభలో చంద్రబాబు మాట్లాడారు. ఎన్నికలకు ముందు.. అనేక మంది టీడీపీ బాధితులు ఉన్నారని, వారందరికీ పార్టీ అండగా ఉంటుందన్నారు.


టీడీపీలో ఉన్న కొందరు దూకుడు నాయకులను ఉద్దేశించి కూడా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. బెల్టు షాపులు పెట్టే వారు ఒళ్లు దగ్గర పెట్టుకోవా లని సూచించారు. ప్రజలనుదోచుకునేవారి విషయంలో తాను కూడా బెల్టు తీస్తానని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఉచిత ఇసుక విషయంలోనూ ఆయన కొన్ని హెచ్చరికలు చేశారు. ఇసుక విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే.. పీడీ యాక్టు నమోదు చేయించి అరెస్టు చేయిస్తామని తేల్చి చెప్పారు. ప్రతి విషయంలోనూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


విశాఖ పట్నం కూడా రాజధానేనని సీఎం చంద్రబాబు చెప్పారు.  ఆర్థిక రాజధానిగా దీనిని డెవలప్ చేయనున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. వైసీపీ హయాంలో నేతల బెదిరింపులతో వెళ్లిపోయిన వారిని మళ్లీ పిలుస్తున్నట్టు చెప్పారు. రాజధాని అమరావతికి కేంద్రం సహకరిస్తోందని, నిర్మాణాలను త్వరలోనే ప్రారంభిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.


విశాఖపట్నం స్టీలు ప్లాంటును ప్రైవేటీకరణ కాకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. దీనిపై పట్టుదలతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు.  విభజన హామీలలో కీలకమైన.. విశాఖ రైల్వే జోన్‌కు రెండు మూడు రోజుల్లో భూమి పూజ చేయనున్నట్టు చెప్పారు. ఇక, శ్రీకాకుళంపై ఈ సందర్భంగా చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. త్వరలోనే విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేసి.. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తామన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: