ఆ విషయంలో పవన్ కల్యాణ్ నే నమ్ముకున్న మోదీ..?
పవన్ కళ్యాణ్ ఒక క్రౌడ్ పుల్లర్, అంతే కాదు ఆయన రాజకీయంగా కూడా బీజేపీ భావ జాలానికి దగ్గర అవుతున్నారు. బలమైన సామాజిక వర్గంతో పాటు విశేషమైన యువత మహిళల మద్దతు కలిగి ఉన్నారు. ఆయనలో బలమైన నాయకుడిని బీజేపీ చూస్తోంది. ఏపీలో తాము ఎప్పటికైనా జెండా పాతాలీ అంటే అది పవన్ లాంటి సునామీతో జత కట్టడం వల్లనే సాధ్యమని బీజేపీ పెద్దలు గాఢంగా విశ్వస్తున్నారు. పవన్ తో నిరంతరం ప్రధాని కార్యాలయం టచ్ లో ఉంటోంది అని అంటున్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పవన్ తో తరచుగా చర్చిస్తూ ఉంటారని అంటున్నారు. పవన్ సైతం కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనేక సార్లు మీడియా ముఖంగా పంచుకుంటున్నారు.
ఈ విధంగా పవన్ తోనే అంతా అన్నట్లుగా బీజేపీ కేంద్ర పెద్దలు వ్యవహరించడానికి ఎన్నో కారణాలు తెర వెనక ఎన్నో వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. ఈ వైఖరి ధోరణి చూస్తూంటే సరైన సమయంలో పవన్ కి బిగ్ ఎలివేషన్ పొలిటికల్ గా ఇస్తూ ఆయన జనసేన పార్టీని బీజేపీలో కలుపుకోవడానికి కూడా చూస్తారు అని అంటున్నారు.
ఏపీ రాజకీయాల్లో బీజేపీ శకం మొదలవ్వాలీ అంటే పవన్ అన్న బలమైన తుఫాను వీయాల్సిందే. అది తమకు అనుకూలంగా ప్రత్యర్ధులను తుడిచిపెట్టే విధంగా వీస్తేనే కమలం ఆంధ్రాలో వికసిస్తుంది అన్నది బీజేపీ పెద్దలకు తెలుసు అని అంటున్నారు. అందుకే పవన్ ని వారు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే పవన్ కూడా పక్కా జాతీయ వాదిగా మారుతున్నారు అని అంటున్నారు.