హోం శాఖ పై పవన్ మనసు పారేసుకున్నారా..?
డిప్యూటీ సీఎం హోదా దక్కినా హోం శాఖ మాత్రం ఆయనకు దక్కలేదు. తనకు ఎంతో ఇష్టమైన పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలనే కోరుకున్నారు అని కూడా అంతా ప్రచారం సాగింది. ఇక కూటమి ప్రభుత్వం ఏపీలో కొలువు తీరి అయిదు నెలలు గడచిన తరువాత సడెన్ గా పవన్ తాను హోం మంత్రిని అయితే అన్న చర్చకు తెర తీశారు. అది కూడా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే ఆయన ఈ ప్రకటన చేశారు. కావాలని అనుకుంటే నేను హోం మంత్రిని కాగలను నేనే హోం మంత్రిని అయితే పరిస్థితులు వేరేగా ఉంటాయని కూడా ఆయన హెచ్చరించారు.
దీనిని బట్టి చూస్తే పవన్ మనసు హోం శాఖ మీద పడిందా అన్నదే అంతటా చర్చగా ఉంది.తనకు పదవులే వద్దు అనుకున్న పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కీలకమైన నాలుగు శాఖలను తీసుకున్నారు. తన శాఖలో పట్టు సాధిస్తున్నారు. ఈ సమయంలో ఆయన ఉన్నట్లుండి హోం శాఖ కావాలని కోరుకోవడమేంటని చర్చ సాగుతోంది.
పవన్ మనసులో ఈ భావన సడెన్ గా వచ్చిందా లేక ఆయన నిజంగానే దీని మీద పట్టుబడుతున్నారా అన్నది మాత్రం తెలియడం లేదు. హోం శాఖ అంటే సీఎం పోస్టు తరువాత స్థానంలో ఉంటుంది. హోం శాఖను పవన్ కోరుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయని అంటున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ బాగా లేదని రోజూ ఫిర్యాదులు వస్తున్నాయని ఇక చూస్తే హోం మంత్రిగా అనిత ఉన్నా తెర వెనక చక్రం తిప్పేవారు ఉన్నారని కూడా అనుమానాలు ప్రచారం ఉంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే జనసేన నేతలకు కూడా సరైన మర్యాద ఈ శాఖ వద్ద దక్కడం లేదు అని అంటున్నారు. అంతా టీడీపీ వారు కోరుకున్న మేరకే పోలీసుల పోస్టింగులు జరిగాయని అంటున్నారు. ఇక జనసేన నేతలు కూడా బాధితులుగానే గత ప్రభుత్వంలో ఉందని అయితే వారి బాధలు వారి విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు అని అంటున్నారు.