చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు సారీ చెబుతున్న శ్రీ రెడ్డి! కూటమి నేతలు క్షమిస్తారా?
జగన్ చెల్లి షర్మిలనూ దుర్భాషలాడుతూ వీడియోలు రిలీజ్ చేసేది. జగన్‌ను ఎవరు ఏమన్నా.. వారిపై తన తిట్ల దండకం అందుకునేది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. సోషల్ టెర్రర్‌పై ఉక్కుపాదం మోపుతోంది. ఈ దెబ్బకు ఇంతకాలం రెచ్చిపోయిన శ్రీరెడ్డి దిగొచ్చింది. గతంలో వపన్ కల్యాణ్, లోకేషన్, చంద్రబాబు, జనసేన, టీడీపీ నేతలను దూషించినందుకు క్షమాపణ కోరింది. ఈమేరకు వీడియో రిలీజ్ చేసింది.
గత వైసీపీ ప్రభుత్వం అండతోనే వీడియోలు రిలీజ్ చేసిన, తీవ్రంగా దుర్భాషలాడిన వైసీపీ సానుభూతిపరులు, సోషల్‌మీడియా నాయకులు, కార్యకర్తలను కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ టార్గెట్చేసింది. నోటీసులు ఇస్తుండడం, అరెస్టులు చేస్తుండడంతో శ్రీరెడ్డికి భయం పుచ్చుకుంది. వెంటనే శ్రీరెడ్డి ఓ వీడియోను రిలీజ్ చేసింది. తామంతా నేతల చేతుల్లో పావులం.. మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలంటే నేతలపై తీసుకోండి. కార్యకర్తలను వదిలేయండి అని ఆ వీడియోలో బతిమాలుకుంది.
ఇక గతంలో తాను మాట్లాడిన మాటలకు లోకేశ్ గారు సారీ. మీ అమ్మగారికి సారీ, మీ భార్యకు సారీ, అనిత గారికిసారీ, పవన్‌కల్యాణ్‌గారికి సారీ. మీ కుటుంబ సభ్యులకు సారీ, నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నా' అని శ్రీరెడ్డి వేడుకుంది. తన సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ, ఆ విధంగా కానీ,ఏ విధంగా కానీ తప్పుడుగా మాట్లాడనని తెలిపింది. తల వంచి నమస్కరిస్తున్నా అని కోరింది. నన్ను నా కార్యకర్తలను వదిలిపెట్టండని, నన్ను క్షమించండి అని వీడియో ముగించింది.