ఇక తిరుమలలో అన్యమతుస్తులకి నో ఛాన్స్? కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ?
అన్య మతస్తులను టీటీడీ నుంచి తప్పించాలని ఉద్యమాలు జరిగాయి. కానీ ఇప్పటికీ అది నినాదం గానే ఉంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. సి ఎస్ గా ఎల్వి సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆ సమయంలో తిరుమలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అన్య మతస్తులు అని అనుమానం వచ్చిన తర్వాత ఉద్యోగుల ఇళ్లకు కూడా వెళ్లి పట్టుకున్నారు. మొత్తంగా 45 మంది ఉద్యోగులను అప్పట్లో తప్పించినట్లుగా తెలుస్తోంది. వారు కోర్టుకెళ్లడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. కానీ జగన్ సర్కార్ ఎల్వి సుబ్రహ్మణ్యంను హఠాత్తుగా తప్పించింది.
టీటీడీలో అన్యమత ప్రచారం చాప కింద నీరులా కొనసాగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. ఈ అంశంపై టీటీడీ విచారణ చేపట్టింది. అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్న వారిని గుర్తించి 69 మందితో కూడిన ఓ జాబితాను రూపొందించింది. టీటీడీ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన మాజీ ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టిటిడి భావించింది. కానీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో టీటీడీపై బలమైన చర్చ నడుస్తోంది. టీటీడీ లడ్డు వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు అన్యమత ఉద్యోగస్తులు విషయం కూడా చర్చకు దారితీసింది. అన్య మతస్తులను టీటీడీలో ఉన్నత ఉద్యోగుల స్థానాల్లో కూర్చోబెట్టారని.. మాంసాహారం, గంజాయి, మద్యం వంటివి కొండపై విరివిగా దొరుకుతున్నాయని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టిడిపి, జనసేనలో తీవ్ర ఆరోపణలు చేశాయి.
తిరుమల కొండ పవిత్రత దెబ్బతినే ప్రమాదం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. టీటీడీ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసింది. అయితే ఈ అన్ని మతస్తుల అంశాన్ని ఎలా పరిగణిస్తుందో చూడాలి.