మళ్ళీ అదే తప్పు చేస్తున్న జగన్? కూటమికి ఇక తిరుగులేదా!
పార్టీ నుంచి చాలా మంది కీలక నేతలు బయటకు వెళ్లిపోయారు. వారంతా కూడా పార్టీకి గట్టి నేతలుగా ఉన్నారు. వెళ్లిపోయిన వారి ప్లేస్ లో జగన్ బలమైన నాయకులను తెచ్చి పెడితేనే పార్టీకి అక్కడ న్యాయం జరుగుతుంది. కానీ జగన్ మాత్రం డమ్మీ నేతలను అక్కడ పెట్టి ఏదో పార్టీని నడపాలని నడుపుతున్నట్లుగా ఉందని అంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీకి ఇదే రకంగా ఘోరమైన పరాజయం ఎదురైనపుడు పార్టీ క్యాడర్ ని ముందు పెట్టి చంద్రబాబు టీడీపీని యాక్టివ్ చేస్తూ ముందుకు సాగిపోయారు అని గుర్తు చేస్తున్నారు.
జగన్ ఆయా నియోజకవర్గాలలో క్యాడర్ అభిప్రాయం తెలుసుకోకుండా ఎవరిని పడితే వారిని నియమిస్తే ఎలా అన్నది వైసీపీలో ఒక చర్చగా సాగుతోంది. ప్రస్తుతానికి కొంత సైలెంట్ గా ఉన్నా ఎన్నికల సమయానికి బలమైన నేతలనే ఇంచార్జిలుగా పెడితేనే పార్టీకి ఊపు గెలుపు హుషార్ వస్తుందని అంటున్నారు.అలా కాకుండా డమ్మీ నేతలను పెడితే మాత్రం అసలుకే ఎసరు వస్తుందని హెచ్చరిస్తున్నారు. లీడర్ కి క్యాడర్ కి మధ్య గ్యాప్ అలాగే ఉండి పార్టీకి మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుందని అంటున్నారు.
ప్రతిపక్షంలో దూకుడుగా ఉండి.. జనాలకు ఎప్పటికపుడు రీచ్ అవ్వాలి. ప్రభుత్వం నుంచి ఏ చిన్న సమస్య వచ్చినా గట్టిగా స్పందించేలా ఉండాలి. కానీ జగన్ చేస్తున్నది వేరుగా ఉంది అని అంటున్నారు. ఆయన ఇంచార్జిలను వేస్తున్నామా లేదా అన్నది మాత్రమే చూస్తున్నారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. వేసిన వారు ఎంతవరకూ పార్టీకి పనికి వస్తారు అన్నది ఆయన ఆలోచించి చేయాల్సి ఉందని అంటున్నారు.