షాకింగ్.. జగన్ సభ్యత్వం రద్దు అవుతుందా?
ఈ సభలకు అసలు హాజరే కావడం లేదు. జగన్ చుట్టూ విమర్శలు.. వివాదాలు జరుగుతున్నాయి. ఆయన రాజీనామా చేయాలని.. సభలకు వెళ్లనప్పుడు పదవులు ఎందుకని ఆయన సోదరి షర్మిల కూడా నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు.. రోజూ అసెంబ్లీలో జగన్ ప్రస్తావన వస్తూనే ఉంది. జగన్ సభకు రావాలని కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సూచిస్తున్నారు. ఇవన్నీ జగన్కు తెలిసి కూడా ఆయన మౌనంగా ఉన్నారు. మీడియా సమావేశాలకు మాత్రమే పరిమితం అయ్యారు. ఇప్పుడు ఒక సంచలన వ్యవహారం తెరమీదికి తెరమీదికి వచ్చింది. మాజీ ఐపీఎస్ ఉమేష్చంద్ర పీవీజీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 సభ్యులు, సభలకు రావాల్సిన విధానాలను స్పష్టం చేసింది. దీనిలో మొత్తం 4 క్లాజులు ఉన్నాయి. వీటిలోనూ ప్రధానంగా 3(ఏ), 3(బీ) అత్యంత కీలకంగా ఉన్నాయి. వరుసగా ఎవరైనా సభ్యుడు కనుక 60 రోజుల పాటు సభలకు హాజరు కాకపోతే.. సదరు సభ్యుడి సభ్యత్వం(ఎమ్మెల్యే) ఆటోమేటిక్గా ఖాళీ అవుతుందని(రద్దు) ఈ ఆర్టికల్ కుండబద్దలు కొడుతోంది. ఇదే విషయాన్ని ఉమేష్ చంద్ర ప్రస్తావిస్తూ.. జగన్ పేరును ఉటంకించారు. జగన్ కనుక 60 రోజుల పాటు సభలకు వెళ్లకపోతే ఆయన సభ్యత్వం రద్దవుతుందన్నది(ఆయనేకాదు.. ఎవరైనా సరే) ఈ ఆర్టికల్ సారాంశంగా పేర్కొన్నారు.ఇలా జరిగినప్పుడే!
మన రాజ్యాంగం చిత్రమైంది. ఇదే 190 ఆర్టికల్ 4వ క్లాజులో మరో ప్రస్తావన కూడా ఉంది. ఏదైనా సభ వరుసగా 60 రోజుల పాటు నిర్విరామంగా జరిగినప్పుడు మాత్రమే.. సభకు హాజరు కాని సభ్యుల సభ్యత్వం రద్దవుతుందని పేర్కొన్నారు. అంటే.. అసెంబ్లీ వరుసగా 60 రోజులు కార్యక్రమాలు జరుపుకోవాలి. అంతేకాదు.. ఈ 60 రోజుల వ్యవధిలో వరుసగా నాలుగు రోజులు సెలవు ఇచ్చినా.. మధ్యలోనే ప్రోరోగ్ చేసినా.. ఆర్టికల్ 190లోని 3 క్లాజ్ సభ్యులకు వర్తించదు.
కాబట్టి.. ఉమేష్ చంద్ర చెప్పింది.. రాజ్యాంగంలో ఉన్నది కరెక్టే అయినా.. అదే రాజ్యాంగంలో ఉన్న క్లాజ్ 4 ఆఫ్ 190 అమలైనప్పుడు మాత్రమే జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవుతుంది. లేకపోతే..అప్పటి వరకు ఎలా ఆడుకున్నా రక్షణ ఉన్నట్టే!!