తెలంగాణలో పెరిగిపోతున్న డైవర్షన్ పాలిటిక్స్? ఎవరి ట్రాప్ లో చిక్కుతున్నారు అంటే..?

తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయా? అధికార, విపక్ష పార్టీలు అసలు సమస్యలు పక్కన పెట్టి కొసరు సమస్యలను తెరరపైకి తెస్తున్నాయా..అంటే అవుననే అంటున్నారు రాజకీయ నిపుణులు. రాష్ర్టంలో పాలనతో పాటు చాలా అంశాలు మరుగునపడ్డాయనే టాక్ నడుస్తున్నది.  వర్షాలు, రుణమాఫీ నుంచి మొదలైన ఈ పాలిటిక్స్ తాజాగా మూసీ, లగచర్ల ఘటనల వరకూ కొనసాగుతూనే ఉన్నాయి.


గత ఎన్నికల కు ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరిట ప్రజల్లోకి వెళ్లింది.  అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలులో పూర్తిస్థాయిలో విఫలమైంది.  మహిళలకు ఆర్టీసీప్రయాణం మినహా గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలను పూర్తిస్థాయి లో అమలు చేయలేకపోయింది.  ఇక రైతు భరోసా అటకెక్కింది. ఇక రూ. 2 లక్షలలోపు రుణమాఫీ కూడా అందరికీ చేయలేకపోయింది. దీనిపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నా అనుకున్న స్థాయిలో ప్రజల్లో కి వెళ్లలేకపోతున్నది.  


అశోక్ నగర్ లో నిరుద్యోగులు వివిధ పోటీ పరీక్షల విషయంలో పోరాటానికి దిగారు. ఈ ఆందోళనలను బీఆర్ఎస్ హైప్ చేసుకుంది. హైడ్రా, మూసీ సుందరీకరణ అంశంలో నూ బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది.  గతంలో మల్లన్నసాగర్ నిర్వాసితుల విషయంలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరుకూడా తెరపైకి వచ్చింది.


లగచర్ల ఘటనలోనూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నది.  అయితే ఇక్కడ బీఆర్ఎస్ స్పందన సరిగా లేదంటూ పలు ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఏదేమైనా రైతులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అసలు ఈ ఘటనకు కారణమే బీఆర్ఎస్ అని.. మాజీ ఎమ్మల్యే నరేందర్ రెడ్డి ని అరెస్టు చేసింది.


ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి అంటూ పలు అంశాలు తెరపైకి వచ్చాయి. మీడియాకు ఇదిగో అరెస్టులు.. అదిగో అరెస్టులు అంటూ లీకులివ్వడం తర్వాత చల్లబడడం కామన్ గా మారిందని పలువురు గొణుక్కుంటున్నారు. ఏదేమైనా ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలాలను పక్కన పెట్టి, కొసరు సమస్యలను అధికార, విపక్ష పార్టీలు ముందు వేసుకోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. కేవలం వ్యక్తిగత రాజకీయాలకు మాత్రమే రెండు పార్టీలు పరిమితమయ్యాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: