జగన్ కి షాక్ ఇస్తున్న వైసీపీ ఎమ్మెల్సీలు? టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారా?
కానీ కొందరు ఎమ్మెల్సీల తీరు మాత్రం అనుమానంగా ఉంది. వారు టీడీపీతో కుమ్మక్కయ్యారా అన్న అనుమానం కలిగేలా ఉంది. ప్రతిపక్ష హోదా దక్కలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతామని జగన్ చెబుతున్నారు. శాసనమండలిలో మాత్రం బలం ఉండడంతో పాటు చైర్మన్, ప్రతిపక్ష హోదా ఉండడంతో సభ్యులు హాజరవుతున్నారు. కానీ ఆశించిన స్థాయిలో వైసీపీ సభ్యులు మాట్లాడడం లేదని జగన్‌లో ఒక రకమైన అనుమానం కలుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎమ్మెల్సీలు నిలదీస్తారని జగన్ ఆశించారు. కానీ మండలిలో విపక్ష నేత బొత్స మాత్రం తప్పు ఒప్పుకున్నట్లు మాట్లాడారు. నారా లోకేష్ తల్లిపై అనుచితంగా మాట్లాడిన వారిని ప్రోత్సహించబోమని ఆయన అన్నారు. అంబటి రాంబాబు నుంచి రిప్లై వచ్చింది. మీ తల్లి గారిని అవమానించినట్లుగా నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. వెంటనే జగన్ ఆనాడు స్పందించిన తీరుకు సంబంధించి వీడియోలు బయటకు వచ్చాయి. అధికారం కోల్పోయిన తొలినాళ్లలో జగన్ ఎమ్మెల్సీలపై ధీమాతో ఉండేవారు. మండలిలో బలం ఉంది కనుక ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను అడ్డుకుందామని ధీమా వ్యక్తం చేశారు. అయితే మండలిలో వైసీపీ సభ్యుల తీరు చూస్తుంటే మాత్రం అది సాధ్యమయ్యే పని కాదని తెలుస్తోంది. ఒకరిద్దరు ఎమ్మెల్సీలు తప్ప… అంతా ప్రభుత్వానికి సరెండర్ అయ్యారన్న అనుమానాలు ఉన్నాయి. ఓ నలుగురు ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా చేస్తే మండలి చైర్మన్ వాటిని ఆమోదించలేదు. ఇప్పుడున్న వారిలో సైతం చాలామంది అసంతృప్తితోనే ఉన్నారు. పక్క చూపులు చూస్తున్నారు. కూటమి నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో వైసీపీలోనే సైలెంట్ గా గడుపుతున్నారు. దీంతో జగన్ ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేయలేకపోతున్నారు