ఢిల్లీలో మంత్రాంగం నడుపుతున్న కేటీఆర్? అరెస్టు నుంచి తప్పించుకునేందుకేనా?
లగచర్ల దుమారం కొనసాగుతోంది. లగచర్లలో ప్రభుత్వం సంబంధం లేని వారి పైన కేసులు నమోదు చేసిందని బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి. కేటీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీ ముఖ్య నేతలు సైతం ఢిల్లీకి రావటంతో.. అక్కడ లగచర్ల బాధితులతో కలిసి సోమవారం ఉదయం జాతీయ మానవహక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, ఉమెన్ రైట్స్ కమిషన్ చైర్మన్లను కలిసి లగచర్ల ఘటనపై ఫిర్యాదు చేస్తున్నారు. లగచర్ల ఘటన గురించి ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ తో పాటుగా కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ ను కేటీఆర్ లక్ష్యంగా చేసుకుంటున్నారు. గత వారం ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ అమృత్ టెండర్లలో స్కాం జరిగిందని కేంద్రమంత్రికి ఫిర్యాదు చేసారు.
లగచర్లలో బాధితుల సమస్య పట్టించుకోకుండా ప్రభుత్వం పోలీసుల సహకారంతో గిరిజన మహిళల పైన దాడులు చేస్తూ వారిని అక్రమంగా అరెస్ట్ చేసిందని బీఆర్ఎస్ నేతలు జాతీయ కమిషన్ లకు ఫిర్యాదులు చేస్తున్నారు. బీఆర్ఎస్ కు పోటీగా బీజేపీ సైతం లగచర్ల ఘటన పైన స్పందిస్తోంది. సంగారెడ్డి జైలులో ఉన్న లగచర్ల గ్రామస్థులను బీజేపీ నేతలు పరామర్శించారు.