జగన్ రాజ గురువుకి షాక్ ఇచ్చిన చంద్రబాబు? దెబ్బ మామూలుగా లేదు గా?

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో విశాఖ శారదా పీఠం ఒక అధికార కేంద్రంగా మారింది. తాడేపల్లి ప్యాలెస్ కు మాదిరిగా.. విశాఖలో శారదా పీఠానికి నేతలు క్యూ కట్టేవారు. 2019కి ముందు అన్ని పార్టీల నేతలు స్వామీజీ వద్దకు వచ్చేవారు. కానీ జగన్ గెలిచిన తర్వాత మాత్రం స్వామి స్వరూపానంద ఇష్టుడైన స్వామీజీగా మారిపోయారు. అందుకే ఏడాదిలో ఒకటి రెండు సార్లు సీఎం హోదాలో జగన్ విశాఖ వచ్చేవారు.



తొలుత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు దగ్గరయ్యారు స్వామి స్వరూపనంద. ఆయన పూజలతోనే తాను సీఎం అయ్యానని చెప్పడంతో జగన్ సైతం ప్రార్థించడం మొదలుపెట్టారు. జగన్ కోసం స్వామీజీ యజ్ఞాలు, యాగాలు చేసేవారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు భారీ యాగం చేశారు. ఆ యాగఫలంతోనే జగన్ సీఎం అయ్యారని ఒక నమ్మకం ఏర్పడింది. అప్పటినుంచి విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద.. అప్పటి ఏపీ సీఎం జగన్ కు రాజ గురువుగా మారిపోయారు.  దేవదాయ శాఖ పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి మార్పులు చేయాలన్నా.. స్వామీజీ సలహా లేనిదే అయ్యేది కాదు. అటువంటి స్వామీజీ ఇప్పుడు జగన్ అధికారానికి దూరం కావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

 


తనకోసం యజ్ఞాలు యాగాలు చేసిన స్వామి స్వరూపానంద కు జగన్ ఎనలేని ప్రాధాన్యం ఇచ్చేవారు. భీమిలిలో 15 ఎకరాల భూమిని స్వామీజీ వైదిక్ యూనివర్సిటీ గురించి కేటాయించారు. బహిరంగ మార్కెట్లో 225 కోట్ల రూపాయల విలువ ఉన్నాయి భూమిని.. ఎకరాకు లక్ష చొప్పున.. 15 లక్షలకు కేటాయించారు. ఆ భూమిని వాణిజ్య అవసరాల కోసం వాడుకుంటానని దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి జగన్ సర్కార్ సానుకూలంగా స్పందించింది. కానీ అప్పటికే ఎన్నికలు రావడం, జగన్ ఓడిపోవడం జరిగిపోయింది. సహజంగానే ఆ భూమిపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. విచారణ చేసి వెనక్కి లాక్కుంది.

 

తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సైతం ఈ రాజ గురువుకు షాక్ ఇచ్చింది. శారదా పీఠానికి వైసీపీ హయాంలో కల్పించిన అన్ని వసతులను రద్దు చేసింది. తిరుమలలోని బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి ఎదురుగా కేటాయించిన స్థలాన్ని కూడా వెనక్కి తీసుకుంది. శారదా పీఠం కోసం ఇచ్చిన లీజును కూడా రద్దు చేసింది. అప్పట్లో స్వామీజీ తిరుమల వస్తే క్యాబినెట్ ర్యాంకు హోదాతో ఆయనకు దర్శన ఏర్పాట్లు చేసేవారు. ఇప్పుడు దానిని రద్దు చేసింది కూటమి ప్రభుత్వం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: