పవన్ కల్యాణ్ సీఎం పదవిపై ఆసక్తి లేదా? దెబ్బకి డీలా పడ్డ జన సైనికులు..!

అవును సైన్యం డీలా పడింది. నడిపించాల్సిన రాజు మాటలను విని సైన్యం నివ్వెరపోయి డీలా పడింది అని అంటున్నారు.  నేనే రాజుని అని కూడా బిగ్ సౌండ్ చేయాలి. కానీ యుద్ధం ఎవరి కోసమో చేస్తూ సైన్యాన్ని నడవమంటే సైనికులు కచ్చితంగా డీలా పడతారు.


ప్రస్తుతం జనసేనలో అదే జరుగుతోంది అని అంటున్నారు.  పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నిండు శాసనసభలో చంద్రబాబు అయిదు కాదు మరో పదేళ్ళు సీఎం అని స్టేట్ మెంట్ ఇచ్చేశారు.  ఒక మనిషి జీవిత కాలంలో కానీ రాజకీయ పార్టీల జీవిత కాలంలో కానీ టైం కే ఎక్కువ విలువ ఉంటుంది.  అందునా రాజకీయాల్లో సీఎం సింహాసనం పట్టాలని అనుకున్న వారికి అయిదేళ్ళూ భారంగా గడుస్తాయి.  


ఎపుడైనా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని కళ్ళకు ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్న జనసేన సైనికులకు పవన్ తాజా పోకడలు నిరాశలో ముంచుతున్నాయా అని అంటున్నారు. పవన్ తో ఉంటూ ఆయనను కాపు కాస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్న అపరిమితమైన అభిమాన జనం ఆయనే సీఎం గా భావిస్తున్నారు. కానీ పవన్ మాత్రం మరో పది నుంచి పదిహేనేళ్ళ పాటు చంద్రబాబే ఏపీకి సీఎం అని చెబుతున్న మాటలు వారికి ఏమాత్రం రుచించడం లేదని అంటున్నారు


మరి పవన్ పాలిటిక్స్ ఆయన వ్యూహాలు ఇదే విధంగా ఉంటే ఆయన ఎప్పటికీ సీఎం కాలేరని అంటున్నారు. ఏపీ పాలిటిక్స్ చూస్తే సామాజిక వర్గాల పరంగా చీలిపోయి ఉంది. పవన్ కి బలమైన కాపుల మద్దతు ఉంది అని అంటారు. పవన్ ఇపుడు ఇచ్చిన స్టేట్ మెంట్ తో జనసేన నాయకులకు అభిమానులకే కాదు ఒక బలమైన సామాజిక వర్గానికి కూడా ఏమీ అర్ధం కాకుండా పోయిందని అంటున్నారు.



పవన్ లో సీఎం అవాలని ఉందా లేదా అన్నది పక్కన పెడితే తమ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందని కూడా అంటున్న వారూ ఉన్నారు. ఈ సమయంలో ఈ తరహా ప్రకటనల వల్ల పార్టీ బలోపేతం కాదని కూడా అంటున్నారు.  ఏది ఏమైనా పవన్ ఇచ్చిన ఈ తరహా ప్రకటనలు జనసేనకు దీర్ఘ కాలంలో మేలు చేసేవి కావనే అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: