అదానీ కేసులో జగన్ నీ ఏమీ చేయలేరా? కేసు అంత ఈజీ కాదా..?

జాతీయస్థాయి మీడియాను పక్కనపెడితే.. ప్రాంతీయ మీడియా విషయానికొస్తే.. ప్రాంతీయ మీడియాలో ఇటు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అనుకూల మీడియా ఒకరకంగా..ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీకి సపోర్ట్ చేస్తున్న మరొక మీడియా ఇంకొక విధంగా అదానీ వ్యవహారాలపై వార్తలు రాశాయి.   ఇందులో వారి పొలిటికల్ లైన్ కు తగ్గట్టుగా వార్తలు ప్రచురించాయి.


ఇందులో ఆశ్చర్యం కలిగించకపోయినప్పటికీ.. దర్యాప్తు సంస్థల బాధ్యతలు కూడా ఆ మీడియా సంస్థలు భుజాలకు ఎత్తుకోవడం ఇక్కడ గమనార్హం. “అవినీతి జరిగిపోయిందని.. అక్రమాలు చోటుచేసుకున్నాయని.. వేల కోట్లు చేతులు మారాయని.. వారంతా కూడా జైలుకు వెళ్లాల్సిందేనని” తీర్మానించాయి. ముఖ్యంగా ఏపీలో జగన్ విషయంలో ఓ వర్గం మీడియా రెచ్చిపోయి రాసింది. వివరణ లాంటిది లేకుండానే తాటికాయంత అక్షరాలతో బ్యానర్ వార్తలను ప్రచురించింది. “నాడు మేం చెప్పిందే నిజమైందని” బొంబాట్ ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టింది. కానీ ఇక్కడే అసలు విషయం ఆ మీడియా సంస్థలు మర్చిపోతున్నాయి.



అమెరికా చట్టాల ప్రకారమే అదానిపై దర్యాప్తు నిర్వహిస్తారు. జగన్ పై ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించారు. మరోవైపు ఇండియాలో ఇలాంటి కేసుల్లో దర్యాప్తు ఎలా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశారని చెప్పడానికి.. ఆదాని అక్రమాలకు పాల్పడ్డారని రుజువు చేయాల్సి ఉంటుంది. లక్షల కోట్లకు ఎదిగిన ఆదాని.. అన్ని రాష్ట్రాలలో వేలకోట్ల పెట్టుబడులు పెట్టిన ఆదానీని దోషిగా నిరూపించాలంటే సాధ్యమయ్యే పని కాదు. అదాని వద్ద డబ్బు తీసుకున్నారని కొన్ని పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి.



అయితే ఆ డబ్బు స్వీకరించిన పార్టీలు ఆదానిపై విచారణను ఎందుకు వేగవంతం చేస్తాయి.. ఇప్పటికే ఆదానిని వెనుకేసుకు రావడం కోసం కొన్ని పార్టీలు ముందుకు వచ్చాయి. జాతీయవాదాన్ని పైకి తీసుకొచ్చాయి. కుట్ర సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నాయి. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డిని దోషిగా ఎలా నిరూపిస్తారు. ఒకవేళ ఓవర్గ మీడియా రాసినట్టు జగన్ ను జైల్లో వేయాలి అనుకుంటే.. దానికి ముందుగా చంద్రబాబు ఒప్పుకోడు. ఎందుకంటే కేంద్రంలో పెద్దలకు వ్యతిరేకంగా, ఆదానికి వ్యతిరేకంగా చంద్రబాబు స్టాండ్ తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆదాని ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టారు. మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటప్పుడు వాటిని వదులుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా ఉండే అవకాశం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: