పవన్ కల్యాణ్ జీవితాంతం ఒకరిపై ఆధార పడాల్సిందేనా? ఇలా ఎంతకాలం..?

రీల్ లైఫ్ లో పవర్ స్టార్.  ఎవరికీ అందనంత ఎత్తులో స్టార్ డమ్‌ ఉంది.  ఇక రాజకీయాల్లో ఓడినా నెత్తిన పెట్టుకునేంత అభిమానం జనసైనికులకు ఉంది. అయితే అందరి కష్టం ఫలితం పవన్ టీడీపీ కూటమిలో అత్యంత కీలకమైన స్థానానికి చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


కేంద్రంలోనూ ఆయనకు విపరీతమైన పలుకుబడి ఉంది.  ఆయన ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం చేసి తనకు బీజేపీ పెద్దలు అప్పగించిన బాధ్యతలను నూరు శాతం సక్సెస్ చేశారు.  ఇంతలా పవన్ తన పొలిటికల్ చరిష్మాతో దూసుకుపోతున్నా జనసైనికులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.


వైసీపీ నుంచి పెద్ద ఎత్తున జనసేనలోకి నేతలు చేరుతామని చెబుతూ ఉన్నా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనుమతి కోసం చూస్తున్నారు అని అంటున్నారు.   ఇక చంద్రబాబుకు కానీ టీడీపీకి కానీ ఇబ్బందిగా ఉండే వారిని ఎవరినీ జనసేనలోకి తీసుకోవడం లేదు అని అంటున్నారు.


ఇలా అయితే జనసేన ఎప్పుడు ఎదుగుతుంది అని ఆందోళన చెందుతున్నారు.  ఏపీలో 175 సీట్లు కాస్తా 225కి పెరిగితే దానికి తగినట్లుగా అభ్యర్థులు కూడా ఆ పార్టీకి కావాల్సి ఉంటుందని అంటున్నారు.  జనసేన మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జిలను వేసుకోకుండా ఉంటే ఎలా అని అంటున్నారు. బలమైన అభ్యర్ధులు జనసేనకు కూడా ఉండాలి కదా అని అంటున్నారు. మరో వైపు చూస్తే చంద్రబాబుని పూర్తిగా నమ్ముతూ పవన్ ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు.


చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో చివరి నిముషంలో తన రాజకీయం మార్చరని గ్యారంటీ ఏముంటుందని అంటున్నారు.   వచ్చిన అధికారాన్ని వాడుకుంటూ పార్టీని బలోపేతం చేసుకోకుండా ఉంటే ఇలా ఎంతకాలం చంద్రబాబు మీద ఆధారపడతామని కూడా అంటున్నారు.  



రాజకీయాలు అంటే నిన్నా నేడూ రేపూ ఒక్కలా ఉండవు. అవి మారుతూ ఉంటాయి. ఇక్కడ అంతా లాభం అనే తూకం రాళ్ళలోనే తులాబారం సాగుతుంది. అలాంటపుడు నమ్మకాలు మంచితనాలు విధేయతలు ధర్మాలు అంటూ పొద్దు పుచ్చితే బంగారం లాంటి అవకాశాలు జనసేన జారవిడుచుకున్నట్లే అని అంటున్నారు.  మరి ఈ విషయంలో అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఇకనైనా దూకుడుగా వ్యవహరిస్తారా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: